నిరుద్యోగులకు Flipkart శుభవార్త.. త్వరలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటన.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

Jobs in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Flipkart నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ కాలేజీల నుంచి దాదాపు 300 మంది విద్యార్థులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది.

 • Share this:
  ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Flipkart నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ కాలేజీల నుంచి దాదాపు 300 మంది విద్యార్థులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(IIM) లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ గతేడాదితో పోల్చితే 30 శాతం అధికంగా నియామకాలు చేపట్టింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగాల్లోనూ ఈ నియామకాలు జరిగాయి. ప్రస్తుతం తాము 300 మందిని నూతనంగా నియమించుకోనున్నట్లు Flipkart చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ తెలిపారు. వారు వచ్చే ఏడాది 2021లో విధుల్లో చేరుతారన్నారు. ఇందుల్లో 180 మంది ఇంజనీర్లు ఉంటారని తెలిపారు.

  సాఫ్ట్ వేర్ డవలప్మెంట్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, బిజినెస్ అనలిస్ట్స్, ప్రొడక్ట్ మేనేజర్స్, ప్రొడక్ట్ డిజైనర్స్ తదితర విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. వారికి ఇండస్ట్రీ ప్రమాణాల ప్రకారం వేతనాలు చెల్లించనున్నారు. తాము మంచి ఉద్యోగావకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉన్నామని రాఘవన్ తెలిపారు. మహిళా ఇంజనీర్ల నియామకాల కోసం ఫ్లిప్ కార్ట్ ‘Girls Wanna Code’ పేరుతో ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది.
  నిరుద్యోగులకు శుభవార్త.. వచ్చే ఏడాది భారీగా ఉద్యోగ నియామకాలు

  ఇదిలా ఉంటే.. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో పేరొందిన శాంసగ్ సంస్థ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందించేందుకు స్కాలర్ షిప్ లు అందిస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో చేరిన జవహార్ నవోదయ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించనున్నట్లు ప్రకటించింది.

  శాంసంగ్ స్టార్ స్కాలర్ ప్రోగ్రాం పేరు మీద ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ స్కాలర్ షిప్ కు అర్హత పొందిన విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు అందించనున్నారు. JEE మెయిన్ లో విద్యార్థులు పొందిన ర్యాంకు ఆధారంగా 150 మంది విద్యార్థులను ఈ స్కాలర్ షిప్ కోసం ఎంపిక చేయనున్నారు. జనవరి 25 వరకు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులను ప్రొత్సహించేందకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ తెలిపింది. భవిష్యత్ లో ఇలాంటి స్కాలర్ షిప్ ప్రోగ్రాంలు మరిన్ని నిర్వహించేందుకు తాము ఆలోచిస్తుననట్లు వివరించింది.
  Published by:Nikhil Kumar S
  First published: