Flipkart: 20,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌కు శిక్షణ ఇవ్వనున్న ఫ్లిప్‌కార్ట్

పార్సిల్ డెలివరీ, స్థానిక రవాణా చట్టాలు, నియమనిబంధనలు, సప్లై చైన్‌కు సంబంధించిన అవగాహన లాంటి అంశాల్లో ఈ శిక్షణ ఉంటుంది. వీటితో పాటు కస్టమర్లతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్న అంశాలతో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది.

news18-telugu
Updated: August 13, 2019, 3:35 PM IST
Flipkart: 20,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌కు శిక్షణ ఇవ్వనున్న ఫ్లిప్‌కార్ట్
Flipkart: 20,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌కు శిక్షణ ఇవ్వనున్న ఫ్లిప్‌కార్ట్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 13, 2019, 3:35 PM IST
సుమారు 20,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌కు శిక్షణ ఇప్పించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ఫ్లిప్‌కార్ట్. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌ 20,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌(విష్ మాస్టర్స్)కు శిక్షణ ఇవ్వనుంది. ఇ-కామర్స్ కంపెనీతో లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌-LSC ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. సప్లై చెయిన్ రంగంలో పనిచేసే డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌కు ప్రొడక్ట్ డెలివరీ నుంచి కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ వరకు అన్ని అంశాల్లో శిక్షణ ఇవ్వడమే ఈ ఒప్పందం లక్ష్యం. లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌‌తో కలిసి డెలివరీ మెకానిజంకు సంబంధించిన అంశాలతో 8 గంటల ట్రైనింగ్ మాడ్యూల్‌ను రూపొందించనుంది ఫ్లిప్‌కార్ట్. పార్సిల్ డెలివరీ, స్థానిక రవాణా చట్టాలు, నియమనిబంధనలు, సప్లై చైన్‌కు సంబంధించిన అవగాహన లాంటి అంశాల్లో ఈ శిక్షణ ఉంటుంది. వీటితో పాటు కస్టమర్లతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్న అంశాలతో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది.

ఈ శిక్షణ పూర్తి చేసిన వారికి నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్-NSFQ నియమాలకు అనుగుణంగా 'రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్' సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ జారీ చేసే ఈ సర్టిఫికెట్‌కు భారతదేశంతో పాటు జర్మనీ, డెన్మార్క్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా దేశాల్లోనూ గుర్తింపు ఉంటుంది. మొదట 20,000 మందికి భవిష్యత్తులో మరో 30,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌కు ఈ శిక్షణ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ దేశంలోని అన్ని ప్రాంతాలకు రోజుకు 10 లక్షల పార్సిల్స్ డెలివరీ చేస్తోంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్




ఇవి కూడా చదవండి:

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా...
Loading...
BECIL Jobs: 2,684 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

UPSC Jobs: డిఫెన్స్, నావల్ అకాడమీలో 415 ఖాళీలు... ఇంటర్ పాసైతే చాలు
First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...