Flipkart Xtra: ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ట్రాతో 4000 పార్ట్ టైం జాబ్స్

(ప్రతీకాత్మక చిత్రం)

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కొత్త మార్కెట్ కొత్తగా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ట్రా అనే ప్రత్యేక మార్కెట్‌ (Market)ప్లేస్ మోడల్‌ని ప్రవేశపెట్టింది. ఈ సేవలను సెప్టెంబర్ 22న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది వ్యక్తులు, సర్వీస్ ఏజెన్సీలు, సాంకేతిక నిపుణులకు పార్ట్‌టైమ్ (Part time) సంపాదన అవకాశాలను అందించడమే లక్ష్యంగా తయారు చేసిన కార్యక్రమంగా ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

  • Share this:
    ఫ్లిప్‌కార్ట్ కొత్త మార్కెట్ కొత్తగా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ట్రా (Flipkart Xtra) అనే ప్రత్యేక మార్కెట్‌ప్లేస్ మోడల్‌ని ప్రవేశపెట్టింది. ఈ సేవలను సెప్టెంబర్ 22న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది వ్యక్తులు, సర్వీస్ ఏజెన్సీలు (Agency), సాంకేతిక నిపుణులకు పార్ట్‌టైమ్స్  (Part time) పాదన అవకాశాలను అందించడమే లక్ష్యంగా తయారు చేసిన కార్యక్రమంగా ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ కార్యక్రమంలో సర్వీస్ ఏజెన్సీలు, సాంకేతికంగా నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఫ్లిప్‌కార్ట్ లో భాగస్వాములుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకొంది. వచ్చేనెల పండుగ సీజన్ లో జరిగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Big Billion day) 2021 సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ట్రా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

    భాగస్వాములయ్యే విధానం..
    - ఆసక్తి ఉన్నవారు తమ ఆండ్రాయిడ్ (Android) ఫోన్ ద్వారా గూగుల్ ప్లే (Google Play) నుంచి ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ట్రా (Flipkart Xtra)యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
    - అనంతరం తమ ఐడీ ఫ్రూఫ్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ధ్రువీకరించుకోవాలి.
    - వాటి వివరాల ఆధారంగా ఈ కార్యక్రమంలో రోల్ ను ధ్రువీకరిస్తారు.

    Xiaomi Civi Series:షియోమీ నుంచి కొత్త సిరీస్.. యూత్‌ను టార్గెట్ చేస్తూ స్మార్ట్‌ఫోన్లు


    - ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ట్రా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌(Executive) ల కోసం సైన్-అప్‌లను అనుమతిస్తుంది.
    - అయితే ఫ్లిప్‌కార్ట్ రాబోయే నెలల్లో సర్వీస్ పార్టనర్స్ అండ్ టెక్నీషియన్‌ (Technician) లను పొందడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
    - దీని ద్వారా ఈ పండగ సీజన్‌లో ఫ్లిప్ కార్ట్ 4,000 ఉద్యోగాలు కల్పించాలని ఇ-కామర్స్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
    - అక్టోబర్ 7 నుంచి ప్రారంభమవుతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2021 మార్కెట్ (Market) కు మరింత ఉతమిస్తుందనడంలో సందేహం లేదు.

    దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లోని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు సప్లై చెయిన్ హెడ్ హేమంత్ బద్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇండియన్ (Indian) మార్కెట్ పునరుద్ధరణకు దోహదం చేస్తుందని అన్నారు. గత సంవత్సరం పండుగ సీజన్‌లో, ఈ కార్యక్రమం 10 మిలియన్ సరుకులను నెరవేర్చడంలో సహాయపడిందని కంపెనీ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ మాదిరిగానే, అమెజాన్ తన అమెజాన్(Amazon) ఫ్లెక్స్ డెలివరీ ప్రోగ్రామ్‌ను భారతదేశంలోని వివిధ నగరాల్లో అందుబాటులో ఉంది. ఇది కంపెనీని పార్ట్‌టైమ్ (Part time) డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా తీసుకురావడానికి సహాయపడుతుంది. అమెరికా ఈ కంపెనీ గంటలకు రూ.120 నుంచి రూ.140 వరకు అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి టూ వీలర్ ఉండాలి.

    ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి టూ వీలర్ ఉండాలి. టూ వీలర్ ఉండటం ఈ ప్రోగ్రాంలో చేరేందుకు అవసరం లేదు. కానీ ఆన్‌బోర్డ్  (On board) చేసిన తర్వాత ఈ అవకాశం ఉంటే సరిపోతుంది. ఖచ్చితమైన చెల్లింపు ఎంత ఉంటుందో కంపెనీ నిర్ణయించలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఈ-కామర్స్ (E-Commerce) రంగంలో పోటీకి ఉపయోగపడుతుంది.
    Published by:Sharath Chandra
    First published: