Jobs: ఫెస్టివల్ సేల్ కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో 1,40,000 ఉద్యోగాల భర్తీ

Jobs | ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఈసారి 1,40,000 తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించాయి. సప్లై చెయిన్, కస్టమర్లకు డెలివరీ చేయడం, కస్టమర్ సపోర్ట్ లాంటి విభాగాల్లో వీరి సేవల్ని వినియోగించుకోనున్నారు.

news18-telugu
Updated: September 26, 2019, 10:21 AM IST
Jobs: ఫెస్టివల్ సేల్ కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో 1,40,000 ఉద్యోగాల భర్తీ
Jobs: ఫెస్టివల్ సేల్ కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో 1,40,000 ఉద్యోగాల భర్తీ
  • Share this:
దసరా, దీపావళి ఫెస్టివల్ సేల్స్ సందర్భంగా ఇ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేశాయి. రెండు సంస్థలు కలిపి ఏకంగా 1,40,000 తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ జరగనుంది. ఈ సేల్స్ కోసం భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటించాయి రెండు సంస్థలు. ప్రతీసారి దసరా, దీపావళి సీజన్‌లో ఇ-కామర్స్ సైట్లకు సేల్స్ ఎక్కువగా ఉంటాయి. సేల్స్ పెరిగితే కస్టమర్లకు డెలివరీ వ్యవస్థను కూడా విస్తరించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులతో ఫెస్టివల్‌లో వచ్చిన ఆర్డర్స్ మేనేజ్ చేయడం ఇ-కామర్స్ సంస్థలకు సాధ్యం కాదు. అందుకే ఫెస్టివల్ సీజన్‌లో తాత్కాలికంగా ఉద్యోగాలను సృష్టిస్తుంటాయి. అందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఈసారి 1,40,000 తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించాయి. సప్లై చెయిన్, కస్టమర్లకు డెలివరీ చేయడం, కస్టమర్ సపోర్ట్ లాంటి విభాగాల్లో వీరి సేవల్ని వినియోగించుకోనున్నారు.

అమెజాన్ తమ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్, సార్టేషన్ సెంటర్స్, డెలివరీ స్టేషన్స్, పార్ట్‌నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ నెట్‌వర్క్, కస్టమర్ సర్వీస్ సైట్లల్లో సేవల కోసం 90,000 మంది సీజనల్ ఉద్యోగుల్ని నియమించుకుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా సప్లైచెయిన్, లాజిస్టిక్స్, కస్టమర్ సపోర్ట్ కోసం 50,000 ఉద్యోగులను తీసుకుంది. ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్‌లో భాగంగా వీరికి నైపుణ్య శిక్షణ కూడా అందించడం విశేషం. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణెలో వీరిని నియమించుకున్నాయి. గతేడాదితో పోలిస్తే 30 శాతం ఎక్కువ ఉద్యోగాలను కల్పించింది. సెప్టెంబర్ చివరి వారం నుంచి నవంబర్ వరకు ఇ-కామర్స్ సైట్లల్లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో తాత్కాలిక ఉద్యోగులతో సేవలు అందించనున్నాయి ఇ-కామర్స్ సైట్లు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఆఫర్ ధరలివే
Loading...
Realme Offers: ఫెస్టివల్ సేల్‌లో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే

Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... కొత్త రేట్లు ఇవే
First published: September 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...