Home /News /jobs /

FLASH RELEASE OF NTA ENTRANCE EXAM ADMIT CARDS DO THIS EASY TO DOWNLOAD UMG GH

CUET: ఫ్లాష్.. ఎన్‌టీఏ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల విడుదల.. ఇలా చేయండి! సులభంగా డౌన్ లోడ్ చేయొచ్చు

ఫ్లాష్.. ఎన్‌టీఏ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల విడుదల.. ఇలా చేయండి! సులభంగా డౌన్ లోడ్ చేయొచ్చు

ఫ్లాష్.. ఎన్‌టీఏ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల విడుదల.. ఇలా చేయండి! సులభంగా డౌన్ లోడ్ చేయొచ్చు

CUET UG 2022 పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.in నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ జులై 15 నుంచి ఆగస్టు 10 వరకు జరగనుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గత వారం ప్రకటించింది.

ఇంకా చదవండి ...
దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). తాజాగా ఎన్‌టీఏ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసింది. CUET UG 2022 పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.in నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ జులై 15 నుంచి ఆగస్టు 10 వరకు జరగనుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గత వారం ప్రకటించింది.

జులై 15, 16, 19, 20న CUET UG ఫేజ్ 1 పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల కోసం CUET అడ్మిట్ కార్డ్స్ విడుదలయ్యాయి. దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకారం, CUET (UG) 2022 పరీక్షకు దాదాపు 14,90,000 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ అభ్యర్థులు 90 యూనివర్సిటీల్లో 54,555 సబ్జెక్ట్స్ కాంబినేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి: Liquor Consumption: అయ్యబాబోయ్.. దేశంలో మహిళలు ఎక్కువగా తాగే రాష్ట్రాలు ఏంటో తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !


 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

CUET UG 2022 పరీక్ష అడ్మిట్ కార్డులను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ ద్వారా తెలుసుకోండి..

స్టెప్ 1 - ముందు అధికారిక వెబ్‌సైట్‌ cuet.samarth.ac.inను సందర్శించండి.

స్టెప్ 2- హోమ్‌పేజీలో 'Download CUET 2022 Admit Card' అనే పేరుతో ఒక లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

స్టెప్ 3- మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి.

స్టెప్ 4- ఇప్పుడు మీ CUET అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

స్టెప్ 5- దాన్ని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్‌అవుట్ తీసుకోండి.



45 సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల ప్రవేశానికి 12వ తరగతి మార్కులు కాకుండా CUET స్కోర్‌ తప్పనిసరి అని ఈ మార్చిలో ప్రకటించారు UGC చైర్మన్ జగదీష్ కుమార్. వర్సిటీలు ఇందుకు కనీస అర్హత ప్రమాణాలను నిర్ణయించవచ్చని వెల్లడించారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థుల్లో 98 శాతం మంది అభ్యర్థులకు తాము ఎంపిక చేసుకున్న నగరంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నట్లు జగదీష్ కుమార్ మంగళవారం తెలిపారు. 2022-23 అకడమిక్ సెషన్‌లో UG ప్రవేశాల కోసం CUET స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకునేందుకు చాలా వర్సిటీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ జాబితాలో 44 సెంట్రల్ యూనివర్సిటీలు, 12 స్టేట్ యూనివర్సిటీలు, 11 డీమ్డ్ యూనివర్సిటీలు, 19 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Admit cards, Career and Courses, JOBS, National Testing Agency

తదుపరి వార్తలు