Home /News /jobs /

FLASH FLASH JEE MAIN SESSION 2 ADMIT CARD RELEASE BY DOING THIS YOU CAN EASILY DOWNLOAD UMG GH

JEE Main Session 2: ఫ్లాష్.. ఫ్లాష్ JEE మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్ విడుదల .. ఇలా చేస్తే మీరు ఈజీగా డౌన్ లోడ్ చేయొచ్చు !

 ఫ్లాష్.. ఫ్లాష్ JEE మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్ విడుదల .. ఇలా చేస్తే మీరు ఈజీగా డౌన్ లోడ్ చేయొచ్చు !

ఫ్లాష్.. ఫ్లాష్ JEE మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్ విడుదల .. ఇలా చేస్తే మీరు ఈజీగా డౌన్ లోడ్ చేయొచ్చు !

JEE మెయిన్ 2022 సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్(Admit Cards) ఈరోజే విడుదల కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వీటిని వెబ్‌సైట్‌ ద్వారా రిలీజ్ చేయనుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2022 సెషన్ 2 పరీక్షల అడ్మిట్ కార్డ్‌లను JEE అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లేదా nta.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
JEE మెయిన్ 2022 సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ఈరోజే విడుదల కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వీటిని వెబ్‌సైట్‌ ద్వారా రిలీజ్ చేయనుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2022 సెషన్ 2 పరీక్షల అడ్మిట్ కార్డ్‌లను JEE అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లేదా nta.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెషన్ 2 పరీక్షలు జులై 25 నుంచి జులై 30 వరకు జరుగుతాయి.

ఈ సంవత్సరం NTA జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE మెయిన్) 2022 సెషన్ 2 (జూలై 2022) కోసం అప్లికేషన్ ఫారమ్‌లను మరోసారి ఓపెన్ చేసింది. సెషన్ 2 కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి అభ్యర్థులకు రెండో అవకాశం ఇచ్చారు. అప్లికేషన్ విండో జులై 9 వరకు ఓపెన్ అయ్యి ఉంది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్‌మిట్ చేయడానికి జులై 9 రాత్రి 11:50 గంటల వరకు సమయం ఇచ్చారు. జేఈఈ మెయిన్ సెషన్ 1 పలితాలు ఇటీవల వెలువడ్డాయి. ఇందులో దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. వీరిలో నలుగురు తెలంగాణ విద్యార్థులు, ముగ్గురు ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు ఉన్నారు.

ఇదీ చదవండి: Technical Bugs: వామ్మో.. ఆ అమెరికా కంపెనీ సాఫ్ట్ వేర్ లో బగ్.. రెచ్చిపోతున్న హ్యాకర్లు !


JEE మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసిన తర్వాత, వాటిని వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం.

స్టెప్ 1: JEE ప్రధాన వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in ఓపెన్ చేయండి.

స్టెప్ 2: "JEE మెయిన్ 2022 అడ్మిట్ కార్డ్" అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. (ఈ లింక్ త్వరలో యాక్టివేట్ అవుతుంది)

స్టెప్ 3: మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌తో లాగిన్ అవ్వండి.

స్టెప్ 4: జులై సెషన్‌కు సంబంధించిన మీ JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్ 5: హాల్ టికెట్‌ను చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోండి.



అభ్యర్థులు NTA వెబ్‌సైట్ నుంచి కూడా అడ్మిట్ కార్డ్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ ఇ-అడ్మిట్ కార్డ్‌లో సూచించిన తేదీ, షిఫ్ట్/టైమింగ్‌లో, సంబంధిత ఎగ్జామ్ సెంటర్‌లో పరీక్షకు హాజరవ్వాలి. ఇతర షిఫ్ట్, తేదీల్లో ఎగ్జామ్ రాసే అవకాశం ఉండదు. అయితే ఎవరికైనా వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డ్‌ డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే, NTA హెల్ప్ లైన్ నంబర్ 011-40759000కి కాల్ చేయవచ్చు. ఈ నంబర్ ద్వారా సేవలు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లోని సూచనలను జాగ్రత్తగా చదవాలని, పరీక్ష సమయంలో వాటిని కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Admit cards, Career and Courses, Jee mains 2022, National Testing Agency

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు