మారుతున్న కాలానికి అనుగుణంగా.. మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కొత్త కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలోనే బెంగుళూర్(Bangalore)లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (The Indian Institute of Science) కొత్తగా స్మార్ట్ ఫ్యాక్టరీలలో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ కోర్సు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (Postgraduation) కోర్సులో 50 సీట్లు ఉన్నాయి.
ఈ కోర్సులో ముఖ్యంగా ప్రొడక్ట్ డిజైన్ తయారీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆటోమెషన్ అంశాలను నేర్చుకొనే అవకాశం ఉంటుంది.
అర్హతలు ఇవే..
ఈ కోర్సు చేసేందుకు అభ్యర్థులు BE లేదా ME, BTech లేదా MTechలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా సంబంధిత రంగంలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. పరిశ్రమలో తయారీ రంగంలో మేనేజిరియల్ (managerial) విభాగంలో పని చేస్తున్న వారికి ఈ కోర్సు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఇంటర్నెట్ సంబంధిత విభాగాల్లో పని చేసే నిపుణులకు (IoT) ఈ కోర్సు వారికి వృత్తి పరంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తుంది. ఫాస్ట్ మూవింగ్ కంస్యూమర్ గూడ్స్ (Fast-moving consumer goods), ఫార్మా ఎక్విప్‌మెంట్ ప్రొడక్షన్, ఎనర్జీ, మెటల్స్, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ విభాగంలో పని చేసే నిపుణులకు ఈ కోర్సు వారి వృత్తి పరంగా ఎదుగుదలకు ఎంతో ఉపయోగ పడుతుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విభాగం అధికారులు చెబుతున్నారు.
దరఖాస్తు చేసుకొనే విధానం
Step-1: ఈ కోర్సులు దరఖాస్తు చేసుకొనేందు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారికి వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. దరఖాస్తు చేసేందుకు క్లిక్ చేయండి
Step-2: కోర్సులో చేరేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి
Step-3: ఈ కోర్సుకు దరఖాస్తు సెప్టెంబర్ 5 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Online Education