Home /News /jobs /

FIVE INITIATIVES AIMED AT SKILLING AND PROVIDING JOB OPPORTUNITIES TO MAKE YOUTH INDEPENDENT GH VB

Initiatives for skilling: ఈ కోర్సులు నేర్చుకోండి.. ఉద్యోగులుగా మారండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Initiatives for skilling: మన దేశంలో యువత కోసం చాలా కంపెనీలు ముందుకొచ్చి వారికి ఉద్యోగాలు, వ్యాపారాలకు సరిపోయే నైపుణ్యాలను నేర్పిస్తుంటాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సంస్థలు అందిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గిస్తున్నాయి. అలాంటి ఐదు సంస్థల వివరాలు మీకోసం..

ఇంకా చదవండి ...
భారత్ ప్రస్తుతం 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేనంత యువ జనాభా భారత్‌లో ఉంది. మన దేశానికి శక్తి యువతే అని చెప్పవచ్చు. అందుకే వీరందరి కోసం చాలా కంపెనీలు ముందుకొచ్చి వారికి ఉద్యోగాలు, వ్యాపారాలకు సరిపోయే నైపుణ్యాలను నేర్పిస్తుంటాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సంస్థలు అందిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గిస్తున్నాయి. అలాంటి ఐదు సంస్థల వివరాలు మీకోసం..

1. విజనెట్ సిస్టమ్స్ వారి ఉన్నతి ఫర్ ఇండియా
విజనెట్ సిస్టమ్స్ సంస్థకు చెందిన ఆలోక్ బన్సల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థ చాలా కుదేలైంది. చాలా సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడానికి చర్యలు చేపట్టాయి. కానీ విజనెట్ సంస్థ మాత్రం తర్వాత జనరేషన్‌కి స్కిల్స్ నేర్పించేందుకు ముందుకొచ్చింది. ఐటీ, బీపీఎం సెక్టార్లలో తదుపరి 5 సంవత్సరాల్లో కనీసం లక్ష మందికి స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు అందించనుంది. వీరందరికీ ఆన్ లైన్ మాడ్యూల్స్ లో ఈ కోర్సులు అందించనుంది. ట్రైనర్లతో నేరుగా మాట్లాడుతూ లైవ్ డెమోల ద్వారా కోర్సులు నేర్చుకునే వీలుంటుంది. 45 నుంచి 60 రోజుల వరకు ఈ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులన్నీ ఉచితంగా అందించనున్నారు. బయట ఈ కోర్సుల ఫీజు రూ.యాభై వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది కానీ వీరు ఉచితంగా అందించి ఆ తర్వాత సర్టిఫికెట్ కూడా అందించనున్నారు. గతేడాది 600 మందికి వీరు శిక్షణ అందించారు. ఇందులో 90 శాతం మందిని వీరే ఉద్యోగంలోకి తీసుకున్నారు.

2. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్.. అమెజాన్
అమెజాన్ ఇండియా సంస్థ ఇటీవల ఓ స్కిల్లింగ్ ప్రోగ్రాంను ప్రారంభించింది. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) ప్రోగ్రాంగా దీన్ని కొనసాగిస్తోంది. కరోనా కాలంలో విద్య, ఉద్యోగం కోసం ఇబ్బందులు పడుతున్న వారికి ఇది సహాయం చేస్తుంది. కనీసం వెయ్యి మందికి అప్రెంటీస్‌షిప్ అందించనుందీ కార్యక్రమం. ఆరు నెలల ప్రోగ్రాంలో భాగంగా వేర్ హౌసింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వంటివి నేర్పిస్తారు. ఇందులో చక్కటి ప్రదర్శన చూపితే వేర్ హౌజ్ అసోసియేట్స్, ప్రాసెస్ అసోసియేట్స్‌గా ఉద్యోగాలు కల్పిస్తారు. లాజిస్టిక్స్ స్కిల్స్ కౌన్సిల్ వీరి ప్రదర్శన చూసి సర్టిఫికెట్లు కూడా అందిస్తుంది. నిరుద్యోగుల్లో స్కిల్స్ పెంచి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేయడమే దీని లక్ష్యం.

3. హితాచీ స్కిల్ డెవలప్ మెంట్ ఇనిషియేటివ్
కరోనా సమయంలో టాలెంట్స్ అన్నింటినీ దేశాలతో సంబంధం లేకుండా ఒక్క చోట చేర్చి ఉద్యోగాలు అందించాల్సిన అవసరం ఏర్పడింది. దీని కోసమే హితాచీ ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్ విభాగాల్లో వర్చువల్ రూట్ ద్వారా ఉద్యోగాలను అందిస్తోంది. వర్చువల్ స్కిల్లింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఐటీఐలు ,స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లలో స్కిల్స్ నేర్పించనుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఈ కోర్సులను నేర్చుకునే వీలుంటుంది. ఇప్పటి వరకు 1500 మంది ఈ కోర్సుల ద్వారా స్కిల్స్ నేర్చుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్ లలో వీరి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఉన్నాయి. 2025 కల్లా కనీసం యాభై వేల నిపుణులను సిద్ధం చేయడం వీరి లక్ష్యం.

4. ఫ్లిప్‌కార్ట్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఈ కామర్స్
ఫ్లిప్‌కార్ట్ సంస్థ లాజిస్టిక్స్ స్కిల్ సెక్టార్ కౌన్సిల్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సంస్థను మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ (MSDE) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించింది. బెంగళూరులో ఈ కామర్స్ సప్లై చెయిన్ సిస్టమ్ లో శిక్షణను అందిస్తోంది ఈ 1500 స్వ్కేర్ ఫీట్ల స్థలంలో ఏర్పాటు చేసిన సెంటర్. ఇందులో భాగంగా స్మార్ట్ క్లాస్ రూంలు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు వంటివన్నీ ఏర్పాటు చేసింది. 60 రోజుల పాటు శిక్షణను అందిస్తోంది. కమ్యూనికేషన్, కస్టమర్ ఇంటరాక్షన్ వంటివన్నీ ఇందులో నేర్పుతారు. దీని ద్వారా శిక్షణ తీసుకున్న వారికి నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా అప్రెంటీస్ షిప్ కూడా అందించనున్నారు.

5. జాబ్స్ నియర్ బై
ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పే నియర్ బై జాబ్స్ నియర్ బై అనే కొత్త ఇనిషియేటివ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా బ్లూ కాలర్ ఉద్యోగులు వలసలకు వెళ్లకుండా వారికి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది. దేశంలోని 17 వేల పిన్ కోడ్స్‌లో 9 లక్షల రిటైల్ పాయింట్స్‌లో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారు ఎవరైనా చక్కటి ఉద్యోగాలను దీని ద్వారా పొందే వీలుంటుంది. ఈ కంపెనీకి పెద్ద నెట్‌వర్క్ ఉంది కాబట్టి, మంచి ఉద్యోగం సాధించే అవకాశాలు ఎక్కువ.
Published by:Veera Babu
First published:

Tags: JOBS, Unemployment

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు