భారత రాజ్యాంగం (Indian constitution) అమల్లోకి వచ్చి ఈ ఏడాది నవంబర్ 26కి సరిగ్గా 72 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ఇవాళ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం (Indian constitution) అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా పేరొందింది. వివిధ అభివృద్ధి చెందిన దేశాల్లోని చట్టాలను (laws) సమీకరించి డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన మన రాజ్యాంగాన్ని రూపొందించారు. అయితే ఆ తర్వాత కాలానుగుణంగా రాజ్యాంగంలో అనేక సవరణలు చేశారు. దేశంలోని ప్రతి వ్యక్తి రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే పౌరుల (citizens) విధులు, బాధ్యతలు, హక్కులు స్పష్టంగా తెలుస్తాయి. అందుకే ప్రభుత్వం కూడా రాజ్యాంగంలోని వివిధ అంశాలపై పౌరులకు అవగాహన కల్పించేందుకు, పోటీ పరీక్షల్లో ఈ సబ్జెట్‌కు అత్యధిక వెయిటేజీ ఇస్తోంది.
పరీక్షల్లో భారత రాజ్యాంగంపైనే ఎక్కువ ప్రశ్నలు..
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (UPSC civils), ఎస్ఎస్సీ సీజీఎల్ (SSC CGL), ఎన్డీఏ, స్టేట్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో భారత రాజ్యాంగంపై ఎక్కువ ప్రశ్నలొస్తున్నాయి. ఈ పరీక్షల్లో నెగ్గాలంటే తప్పనిసరిగా రాజ్యాంగంలోని అంశాలపై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు (candidates) ఉపయోగపడేలా వివిధ ప్లాట్‌ఫారమ్‌లు భారత రాజ్యాంగంపై ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నాయి. అవేంటో చూద్దాం.
నల్సార్ యూనివర్సిటీ, హైదరాబాద్
న్యాయ మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ (Hyderabad)లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా రెండూ కలిసి సంయుక్తంగా భారత రాజ్యాంగంపై ఆన్‌లైన్ కోర్సు (online course)ను నిర్వహిస్తున్నాయి. legalaffairs.nalsar.ac.in వెబ్‌సైట్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ కోసం రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
భారత రాజ్యాంగం, ఉడెమీ (Udemy)
ప్రముఖ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ (Online learning platform) ఉడెమీ “భారత రాజ్యాంగం” కోర్సును అందిస్తుంది. ఈ కోర్సు భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను హైలైట్ చేస్తుంది. ఉడెమీ ప్లాట్‌ఫామ్ “ఇండియన్ పాలిటీ అండ్ కాన్‌స్టిట్యూషన్” అనే మరో ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహిస్తోంది. ప్రభుత్వ వ్యవస్థ, రాజ్యాంగ మరియు రాజ్యాంగేతర సంస్థల గురించి వివరిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా పోటీ పరీక్షల అభ్యర్థుల (competitive exams candidates) కోసం రూపొందించారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ అందజేస్తారు.
90 నిమిషాల్లో రాజ్యాంగ చట్టం, ఉడెమీ
తక్కువ సమయంలో రాజ్యాంగం (Indian constitution) పై అవగాహన ఏర్పర్చుకోవాలంటే ఉడెమీ (Udemy) అందిస్తున్న '90 నిమిషాల్లో రాజ్యాంగ చట్టం' కోర్సులో రిజిస్టర్ అవ్వండి. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో లా ఆప్షనల్‌గా ఎంచుకునే విద్యార్థులతో పాటు న్యాయ విద్యార్ధులకు ఈ కోర్సు ఉపయోగకరంగా ఉంటుంది.
భారత రాజ్యాంగం (పార్ట్ 1), ఫినాలజీ లెర్న్ (Finology learn)
ఫినాలజీ లెర్న్ ప్లాట్‌ఫామ్ రాజ్యాంగం (Indian constitution) లోని ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవడానికి విస్తృతమైన కోర్సును అందిస్తుంది. ఈ కోర్సును 60+ టాపిక్స్‌తో, 20 మాడ్యూళ్లతో రూపొందించింది. వీడియో లెక్చర్లు, కాంప్రెహెన్సివ్ నోట్స్ ద్వారా కోర్సును అందిస్తోంది. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్ అందజేస్తారు.
భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు- My law
ప్రాథమిక హక్కులు (Fundamental rights) అంటే ఏంటి? వాటి ఉద్దేశ్యం? భారత సుప్రీంకోర్టు వాటిని ఎలా వివరించింది? అనే అంశాలపై అవగాహన కల్పిస్తుంది My law ప్లాట్‌ఫాం. కోర్సు పూర్తయిన తర్వాత కోర్స్ కంప్లీషన్ టెస్ట్ (CCT) నిర్వహిస్తోంది. సీసీటీ ఫలితాల ఆధారంగా, అభ్యర్థికి సర్టిఫికేట్ అందజేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lok Sabha Key Constituency, New course, Online Education