కరోనా నేపథ్యంలో ఇప్పటికే పదో తరగతి పరీక్షలు రద్దుయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఐతే డిగ్రీ పరీక్షలను కూడా వాయిదా వేయాలని పలు విశ్వ విద్యాలయాలు యోచిస్తున్నాయి. ఈ క్రమంలో యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) కీలక వ్యాఖ్యలు చేసింది. విశ్వవిద్యాలయాల్లో చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. యూనివర్సిటీలు పరీక్షలను రద్దు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అన్ని యూనివర్సిటీలు సెప్టెంబరులోగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ గత సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఢిల్లీ ప్రభుత్వం యూజీసీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ డిగ్రీ పరీక్షలను రద్దుచేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) కూడా పరీక్షలను రద్దుచేసి గ్రేడింగ్ ఇవ్వాలని యోచిస్తోంది. ఐతే కొన్ని ప్రభుత్వాలు చివరి సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూజీసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lockdown relaxations, UGC