TS EAMCET: ఈ నెల 24 నుంచి తుది విడత కౌన్సెలింగ్.. 26న ధ్రువపత్రాల పరిశీలన..
TS EAMCET: ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 24, 25 తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: July 18, 2019, 10:55 AM IST
తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సు ప్రవేశాలకు ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 24, 25 తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని వెల్లడించారు. ఈ నెల 26న ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుందని, 24 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కాలేజీల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన సీట్లు కేటాయిస్తామని నవీన్ మిట్టల్ వెల్లడించారు. మొదటి దశలో కౌన్సెలింగ్‌లో 49,012 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా 42 వేల మంది రిపోర్ట్ చేసినట్లు ఆయన వివరించారు.
కాగా, ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాల కోసం డిప్లొమా విద్యార్థులకు ఈ రోజు నుంచే ఈసెట్ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు నవీన్ మిట్టల్ తెలిపారు. రేపటి (ఈ నెల 19) వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించామన్నారు.
కాగా, ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాల కోసం డిప్లొమా విద్యార్థులకు ఈ రోజు నుంచే ఈసెట్ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు నవీన్ మిట్టల్ తెలిపారు. రేపటి (ఈ నెల 19) వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించామన్నారు.
Jobs: బీఎస్సీ, బీటెక్, ఎంటెక్, అర్హతతో 328 జాబ్స్... రేపే లాస్ట్ డేట్
Railway Jobs: ఈశాన్య రైల్వేలో ఉద్యోగాలు... రేపే చివరి తేదీ
HCL Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జాబ్స్... రేపే చివరి తేదీ
CBSE Jobs: సీబీఎస్ఈలో 357 జాబ్స్... రేపే లాస్ట్ డేట్
Govt Jobs: ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... అప్లికేషన్ స్టెప్స్ ఇవే
SAIL Jobs: స్టీల్ అథారిటీలో 399 ట్రైనీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు