హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CUET PG 2023: సీయూఈటీ పీజీతో మరో 15 వర్సిటీలలో అడ్మిషన్స్‌.. పూర్తి వివరాలు ఇవే

CUET PG 2023: సీయూఈటీ పీజీతో మరో 15 వర్సిటీలలో అడ్మిషన్స్‌.. పూర్తి వివరాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రవేశ పరీక్షల ప్రక్రియను సులువుగా మారుస్తూ, అందరికీ సమాన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో కేంద్రం కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్(CUET) తీసుకొచ్చింది. యూజీ, పీజీ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ప్రవేశ పరీక్షల ప్రక్రియను సులువుగా మారుస్తూ, అందరికీ సమాన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో కేంద్రం కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్(CUET) తీసుకొచ్చింది. యూజీ, పీజీ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తోంది. తొలుత ఈ పరీక్షను అర్హతగా భావించేందుకు కొన్ని వర్సిటీలే ముందుకు వచ్చాయి. ఇప్పుడు వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్, డీమ్డ్, ప్రైవేట్ వర్సిటీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి అర్హత పరీక్షగా సీయూఈటీ పీజీని అనుసరిస్తున్నాయి. సీయూఈటీ పీజీలో ఈ ఏడాది కొత్తగా మరో 15 యూనివర్సిటీలు చేరాయి. వాటి వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది.

కొత్త సీయూఈటీ పీజీలో చేరిన వర్సిటీలు ఇవే

- ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్

- శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ- కత్రా

- పారుల్ యూనివర్సిటీ- వడోదర

- నేతాజీ సుభాస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ- ద్వారక

- శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ-గుర్గావ్

- SRM యూనివర్సిటీ ఢిల్లీ-NCR, సోనేపట్

- జ్ఞాని ఇందర్ సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్ —సింగ్ భండారీ ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ- డెహ్రాడూన్

- యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- మేఘాలయ

- జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- నోయిడా

- శారదా యూనివర్సిటీ

- అమర్‌కంటక్‌లోని ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సహకారంతో ఇండియన్ క్యులినరీ ఇన్‌స్టిట్యూట్

- బాబా గులాం షా బాద్‌షా యూనివర్సిటీ, రాజౌరి, జమ్మూ కాశ్మీర్

- క్వాంటం యూనివర్సిటీ-రూర్కీ

- బినోద్ బిహారీ మహతో కోయలాంచల్ యూనివర్సిటీ- ధన్‌బాద్

- టీఆర్‌ఐ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్- న్యూఢిల్లీ

కొత్త కోర్సులను జోడించిన యూనివర్సిటీలు

సీయూఈటీ పీజీ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి కొన్ని యూనివర్సిటీలు కొత్త కోర్సులను జోడించాయి. ఈ జాబితాలో జమ్మూ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ-ఏపీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ-ఢిల్లీ, సోమయ్య విద్యావిహార్ యూనివర్సిటీ, త్రిపుర యూనివర్సిటీ, డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలు ఉన్నాయి.

కోర్సులను తొలగించిన, సవరించిన యూనివర్సిటీలు

మరికొన్ని యూనివర్సిటీలు కోర్సులను తొలగించడంతో పాటు సవరించాయి. మదన్ మోహన్ మాలవ్య యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ- గోరఖ్‌పూర్, డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయ సాగర్, సంగమ్ యూనివర్సిటీ- రాజస్థాన్ సీయూఈటీ పీజీలో కొన్ని కోర్సులను తొలగించాయి. కొన్ని కోర్సులను సవరించిన యూనివర్సిటీల్లో సిక్కిం యూనివర్సిటీ, నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ (NEHU), డాక్టర్ BR అంబేద్కర్ యూనివర్సిటీ- ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాయి.

* జూన్ 1 నుంచి పరీక్షలు ప్రారంభం

సీయూఈటీ పీజీ-2023కు సంబంధించి ఎన్‌టీఏ కీలక నోటీసు జారీచేసింది. సమాచార బులిటెన్‌లోని పేజీ నెం-12, 68లో టైపోగ్రాఫికల్ ఎర్రర్‌‌గా హిందూ అధ్యయనాలు (ACQP08) పేపర్ సంస్కృతం, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో జరుగుతుందని అందులో ఉందని, అయితే ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీలో జరుగుతుందని తాజాగా అధికారిక నోటీసులో ఎన్‌టీఏ పేర్కొంది. కాగా, సీయూఈటీ పీజీ-2023 పరీక్షలు జూన్1 నుంచి 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఏప్రిల్ 19తో ఈ గడువు ముగియనుంది.

First published:

Tags: Career and Courses, Cuet, CUET 2023, JOBS