హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Admit Cards: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ కు మరికొన్ని గంటలే సమయం..

Admit Cards: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ కు మరికొన్ని గంటలే సమయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఎస్సై(SI), కానిస్టేబుల్(Constable) ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ముఖ్య గమనిక. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేసిన పోలీస్ నియామక బోర్డు.. ఈవెంట్స్(Events) తేదీలను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ ఎస్సై(SI), కానిస్టేబుల్(Constable) ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ముఖ్య గమనిక. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేసిన పోలీస్ నియామక బోర్డు.. ఈవెంట్స్(Events) తేదీలను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్(December) 8 నుంచి జనవరి 03, 2023 వరకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు ఈవెంట్స్ పై కసరత్తు ప్రారంభించారు. అయితే అడ్మిట్ కార్డులను వెబ్ సైట్లో నవంబర్ 29 నుంచి అందుబాటులో ఉంచారు. ఈ అడ్మిట్ కార్డులను డిసెంబర్ 03, 2022 అర్థరాత్రి 12 గంటల వరకు వెబ్ సైట్లో ఉంచనున్నారు. అంటే ఈ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవడానికి కొన్ని గంటలే మిగిలి ఉంది. ఎవరైనా ఇంకా డౌన్ లోడ్ చేసుకోకపోతే.. వారు ఈ కింద తెలిపిన విధంగా డౌన్ లోడ్ చేసుకోండి. అడ్మిట్ కార్డుల లేనిది తదుపరి పరీక్షలకు పోలీసులు అనుమతినివ్వరు.

KVS Recruitment 2022: కేవీఎస్ నుంచి 6,990 పోస్టులకు నోటిఫికేషన్.. PGT, TGTతో పాటు ఇతర పోస్టులు..

అయితే అభ్యర్థులు అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే విధానం ఇలా..

-మొదట అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

-దీనిలో వెబ్ సైట్ టాప్ లో పీఎంటీ, పీఈటీ అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి.

-తర్వాత ఓపెన్ అయిన పేజీలో మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి.. దీంతో పాటు పాస్ వర్డ్ ఇవ్వాలి.

-తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ ను ఇస్తే మీ వ్యక్తిగత డ్యాష్ బోర్డు ఓపెన్ అవుతుంది.

-దీనిలో పీఎంటీ, పీఈటీ అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ అనే ఆప్షన్ ను ఎంచుకొని.. హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

-దీనిలో పేర్కొన్న సూచనలను క్షణ్ణంగా చదువుకోవాలి. తర్వాత ఈ అడ్మిట్ కార్డును మీకు ఈవెంట్స్ జరిగే రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 కేంద్రాల్లో ఈ శారీరర సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. 25 రోజుల్లోపు ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు https://www.tslprb.in/ వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

Police Vacancies 2022: పది పాసైన వారికి గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ లో ఏమైనా సమస్యలు ఏర్పడితే..93937 11110 లేదా 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చు. support@tslprb.in ఈ మెయిల్ ద్వారా కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. శారీరక సామర్ధ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డులను వెంట తెచ్చుకోవాలని, బయోమెట్రిక్ ద్వారా పరీక్షలకు అనుమతిస్తారని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. పార్ట్ 2 అప్లికేషన్ , కమ్యూనిటీ సర్టిఫికేట్ ను వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

Jobs In Railway: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి దరఖాస్తులు..

PET/PMT కేంద్రాలివే.. 

1. హైదరాబాద్- ఎస్ఏఆర్‌సీపీఎల్ - అంబర్‌పేట

2. సైబరాబాద్- 8వ బెటాలియన్ కొండాపూర్

3. రాచకొండ- సరూర్‌నగర్ స్టేడియం

4. కరీంనగర్- సిటీపోలీస్ శిక్షణ కేంద్రం

5. ఆదిలాబాద్- పోలీస్ పరేడ్‌ గ్రౌండ్

6. నిజామాబాద్ రాజారాం స్టేడియం, నాగారం(నిజామాబాద్)

7. మహబూబ్‌నగర్- డిస్ట్రిక్ట్ స్టేడియం స్పోర్ట్స్ గ్రౌండ్

8. వరంగల్- హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం

9. ఖమ్మం- పోలీస్ పరేడ్ గ్రౌండ్

10. నల్గొండ- మేకల అభినవ్ స్టేడియం

11. సంగారెడ్డి (సిద్దిపేటలో కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి)

First published:

Tags: Admit cards, JOBS, Tslprb

ఉత్తమ కథలు