హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

FCI Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ఫుడ్ కార్పొరేషన్ లో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

FCI Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ఫుడ్ కార్పొరేషన్ లో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AE), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (EM) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AE), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (EM) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ (FCI Job Notification) ద్వారా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు FCI అధికారిక వెబ్‌సైట్ fci.gov.inలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డిప్యూటేషన్ ప్రాతిపదికన జరుగుతోంది. ఎంపికైన అభ్యర్థులు 03 సంవత్సరాల పదవీకాలానికి నియమిస్తారు. దానిని 5 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.

FCI భారతి (FCI ఖాళీల వివరాలు):

S.No.పోస్టుఖాళీలు
1.అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AE)26
2.అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (EM)20
మొత్తం పోస్టుల సంఖ్య:46

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AE): అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి. కనీసం 05 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (EM): అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. E-3 లేదా L-11 గ్రేడ్‌లో సారూప్యమైన పోస్ట్‌/ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులలో కనీసం 05 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.

Postal Jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్ అర్హతతో పోస్టాఫీస్ జాబ్స్ .. ఈ స్టెప్స్ తో అప్లై చేసుకోండి

వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 60,000- 1,80,000 ఇవ్వబడుతుంది.

FCI అభ్యర్థుల కోసం ఇతర సమాచారం:

పూర్తి చేసిన దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్ (Estt-I), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెడ్‌క్వార్టర్స్, 16-20 బరాఖంబ లేన్, న్యూ ఢిల్లీ-110001కి చివరి తేదీలో లేదా అంతకు ముందు క్రింద ఇవ్వబడిన చిరునామాలో పంపించాల్సి ఉంటుంది.

First published:

Tags: Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు