హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Central Govt Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. FCIలో 5 వేల జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్

Central Govt Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. FCIలో 5 వేల జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 5043 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు (Jobs) సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి రేపు అంటే.. అక్టోబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌ను నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మరియు నార్త్-ఈస్ట్ జోన్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం నిర్వహిస్తున్నారు. అర్హత, ఆషక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    జోన్ల వారీగా ఖాళీల వివరాలు:

    జోన్ఖాళీలు
    నార్త్ జోన్2388 ఖాళీలు
    సౌత్ జోన్989 ఖాళీలు
    ఈస్ట్ జోన్768 ఖాళీలు
    వెస్ట్ జోన్713 ఖాళీలు
    నార్త్ ఈస్ట్ జోన్185 ఖాళీలు
    మొత్తం: 5043

    నోటిఫికేషన్ ప్రకారం.. మెకానికల్‌లో సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ మరియు జూనియర్ ఇంజనీర్, స్టెనో గ్రేడ్-3 మరియు AG-3 జనరల్, అకౌంట్స్, టెక్నికల్, డిపో, హిందీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

    Railway Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.. పూర్తి వివరాలివే..

    విద్యార్హతలు:

    JE (EME) - 1 సంవత్సరం అనుభవంతో EE/ME ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.

    JE (సివిల్) - 1 సంవత్సరం అనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.

    AG-III (టెక్నికల్) – అగ్రికల్చర్ / బోటనీ / బయాలజీ / బయోటెక్ / ఫుడ్‌లో గ్రాడ్యుయేషన్.

    AC-III (జనరల్) - గ్రాడ్యుయేషన్ డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్.

    AG-III (అకౌంట్స్) - B.Com మరియు కంప్యూటర్ నాలెడ్జ్.

    AG-III (డిపో) - గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ నాలెడ్జ్.

    హిందీ టైపిస్ట్ AG-II (హిందీ) - హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 వర్డ్స్ స్పీడ్, గ్రాడ్యుయేషన్. అనువాదంలో 1 సంవత్సరం అనుభవం.

    స్టెనో గ్రేడ్-II - DOEC O స్థాయి సర్టిఫికేట్‌తో గ్రాడ్యుయేట్. టైపింగ్ మరియు స్టెనో పరిజ్ఞానం.

    ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రెండు ఫేజ్ లలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. స్టెనో పోస్టులకు సంబంధించి స్కిల్/టైపింగ్ టెస్ట్ ఉంటుంది.

    -తెలుగు రాష్ట్రాల్లో ఫేజ్-1 ఎగ్జామ్ సెంటర్లు: నెల్లూరు , విజయవాడ , కాకినాడ, కర్నూలు , తిరుపతి , విజయనగరం, రాజమండ్రి , ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Fci jobs, JOBS

    ఉత్తమ కథలు