ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 5043 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు (Jobs) సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌ను నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మరియు నార్త్-ఈస్ట్ జోన్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం నిర్వహిస్తున్నారు. అర్హత, ఆషక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
జోన్ | ఖాళీలు |
నార్త్ జోన్ | 2388 ఖాళీలు |
సౌత్ జోన్ | 989 ఖాళీలు |
ఈస్ట్ జోన్ | 768 ఖాళీలు |
వెస్ట్ జోన్ | 713 ఖాళీలు |
నార్త్ ఈస్ట్ జోన్ | 185 ఖాళీలు |
మొత్తం: | 5043 |
నోటిఫికేషన్ ప్రకారం.. మెకానికల్‌లో సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ మరియు జూనియర్ ఇంజనీర్, స్టెనో గ్రేడ్-3 మరియు AG-3 జనరల్, అకౌంట్స్, టెక్నికల్, డిపో, హిందీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు:
JE (EME) - 1 సంవత్సరం అనుభవంతో EE/ME ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.
JE (సివిల్) - 1 సంవత్సరం అనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.
AG-III (టెక్నికల్) – అగ్రికల్చర్ / బోటనీ / బయాలజీ / బయోటెక్ / ఫుడ్‌లో గ్రాడ్యుయేషన్.
AC-III (జనరల్) - గ్రాడ్యుయేషన్ డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్.
AG-III (అకౌంట్స్) - B.Com మరియు కంప్యూటర్ నాలెడ్జ్.
AG-III (డిపో) - గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ నాలెడ్జ్.
హిందీ టైపిస్ట్ AG-II (హిందీ) - హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 వర్డ్స్ స్పీడ్, గ్రాడ్యుయేషన్. అనువాదంలో 1 సంవత్సరం అనుభవం.
స్టెనో గ్రేడ్-II - DOEC O స్థాయి సర్టిఫికేట్‌తో గ్రాడ్యుయేట్. టైపింగ్ మరియు స్టెనో పరిజ్ఞానం.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రెండు ఫేజ్ లలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. స్టెనో పోస్టులకు సంబంధించి స్కిల్/టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
-తెలుగు రాష్ట్రాల్లో ఫేజ్-1 ఎగ్జామ్ సెంటర్లు: నెల్లూరు , విజయవాడ , కాకినాడ, కర్నూలు , తిరుపతి , విజయనగరం, రాజమండ్రి , ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Fci, Food corporation, Job notification, JOBS