హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తులు..

FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తులు..

FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తులు..

FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తులు..

FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు FCI అధికారిక వెబ్‌సైట్ fci.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 27 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంట.. ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు https://fci.gov.in/.అలాగే.. ఈ లింక్ ద్వారా FCI మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ PDF, మీరు అధికారిక నోటిఫికేషన్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మొత్తం 113 పోస్టులను భర్తీ చేయున్నారు. అర్హత, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజులాంటి తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..


TSPSC Group 4 Jobs: గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ ఆ నెలలోనే..? ఆలస్యానికి కారణం ఇదే..


ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 27 ఆగస్టు 2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 26 సెప్టెంబర్ 2022

పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 26 సెప్టెంబర్ 2022


ఖాళీ వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య – 113


మేనేజర్ జనరల్-19


మేనేజర్ డిపో-15


మేనేజర్ Movement-06


మేనేజర్ Accounts-35


మేనేజర్ టెక్నికల్-28


మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్-06


మేనేజర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్-01


మేనేజర్ హిందీ-03అర్హత ప్రమాణాలు..

మేనేజర్(General, Depot, Movement) పోస్టులకు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమానం లేదా CA/ICWA/CS కలిగి ఉండాలి. SC/ST/ PwBD అభ్యర్థుల విషయంలో కనీస మార్కుల శాతం 60% కి బదులుగా 55% ఉండాలి.


మేనేజర్ (అకౌంట్స్)..

బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ బీకామ్ మరియు MBA(ఫిన్) డిగ్రీ/ కనిష్ట 2 సంవత్సరాల డిప్లొమా లేదా CA/CS కలిగి ఉండాలి.


వయోపరిమితి..

మేనేజర్ హిందీ పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాలు

ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


DRDO Recruitment 2022: డీఆర్డీఓలో ఉద్యోగాలు .. B.Sc డిగ్రీ , బీటెక్ అభ్యర్థులు అర్హులు..


టెక్నికల్ మేనేజర్


గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.


లేదా


గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ AICTEచే ఆమోదించబడిన సంస్థ నుండి ఫుడ్ సైన్స్‌లో B.Tech డిగ్రీ లేదా BE డిగ్రీ.


లేదా


ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ లేదా ఫుడ్ టెక్నాలజీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ లేదా ఫుడ్ ప్రాసెస్‌లో B.Tech డిగ్రీ లేదా BE డిగ్రీ.


AICTEచే ఆమోదించబడిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుండి ఇంజనీరింగ్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ లేదా ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ కలిగి ఉండాలి.


లేదా


బి.టెక్. AICTEచే ఆమోదించబడిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా BE డిగ్రీ.


లేదా


గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ AICTEచే ఆమోదించబడిన సంస్థ నుండి బయో-టెక్నాలజీ లేదా ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ లేదా బయో-కెమికల్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చరల్ బయో-టెక్నాలజీలో B.Tech డిగ్రీ లేదా BE డిగ్రీ.


New Business Idea: ప్రతి నెలా రూ. లక్ష సంపాదన.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. ఆ బిజినెస్ ఏంటంటే..


మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్..


గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమానం.


మేనేజర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్..


గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమానం.


మేనేజర్ హిందీ


డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్‌తో పాటు హిందీలో మాస్టర్ డిగ్రీ లేదా డిగ్రీ స్థాయిలో హిందీతో మాస్టర్ డిగ్రీ లేదా ఏదైనా సబ్జెక్టులో ఇంగ్లీషు మీడియం మరియు హిందీతో ఏదైనా సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీ. లేదా హిందీ మీడియంతో ఏదైనా సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీ మరియు డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి. 5 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి


దరఖాస్తు రుసుము..

అభ్యర్థులు రూ. 800 ఫీజు చెల్లించలి. SC/ST/PWBD మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.


జీతం..

అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుండి రూ. 1,40,000 వరకు ఇస్తారు.


ఎంపిక ప్రక్రియ..

మేనేజర్ (జనరల్/డిపో/మూవ్‌మెంట్/అకౌంట్స్/టెక్నికల్/సివిల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టలుకు ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ మరియు ట్రైనింగ్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

మేనేజర్ (హిందీ)పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు ఇలా..


- మొదట FCI యొక్క అధికారిక వెబ్‌సైట్ https://fci.gov.in/ని సందర్శించండి.


- రిజిస్ట్రేషన్ కొరకు మీ వివరాలను నమోదు చేయండి.


-రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.


- FCI మార్గదర్శకాల ప్రకారం స్కాన్ చేసిన ఫొటో మరియు సంతకాన్ని అప్‌లోడ్ చేసి దరఖాస్తులను సమర్పించాలి.


-దరఖాస్తు రుసుమును విజయవంతంగా చెల్లించిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అభ్యర్థులు నమోదిత ఇమెయిల్ ID/ఫోన్ నంబర్‌కు మెయిల్ లేదా సందేశాన్ని అందుకుంటారు.


-దరఖాస్తు ఫారమ్ ను భవిష్యత్ అవసరాల కొరకు ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

First published:

Tags: Career and Courses, Central Government Jobs, Central jobs, Fci, JOBS

ఉత్తమ కథలు