హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

FCI Recruitment 2021 | ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-FCI అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-FCI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, అకౌంట్స్, లా విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 89 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు 2021 మార్చి 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

FCI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 89 (జనరల్- 43, ఎస్సీ- 14, ఈడబ్ల్యూఎస్- 9, ఓబీసీ- 7, ఎస్టీ-6)

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్)- 30

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 27

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్)- 22

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా)- 8

మెడికల్ ఆఫీసర్- 2

UPSC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

Jobs 2021: నిరుద్యోగులూ బీ రెడీ... ఈ ఏడాది ఆ కంపెనీలో 30,000 ఉద్యోగాలు

FCI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 1 ఉదయం 10 గంటలు

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 31 సాయంత్రం 5 గంటలు

అడ్మిట్ కార్డుల విడుదల- పరీక్షకు 10 రోజుల ముందు

రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్- 2021 మే లేదా జూన్

FCI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు- రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ. ఆన్‌లైన్ టెస్ట్‌లో అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి. ఖాళీల కన్నా మూడు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.

వేతనం- రూ.50,000 నుంచి రూ.1,80,000

Sleep Internship: రోజూ 9 గంటలు... 100 రోజులు నిద్రపోతే రూ.10,00,000 మీ సొంతం... అప్లై చేయండిలా

Indian Navy Recruitment 2021: టెన్త్ అర్హతతో ఇండియన్ నేవీలో 1159 జాబ్స్... విశాఖపట్నంలో 710 ఉద్యోగాలు

FCI Recruitment 2021: అప్లై చేయండి ఇలా


అభ్యర్థులు https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Assistant General Manager నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.

Apply Online పైన క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వస్తుంది.

రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.

ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి పేమెంట్ చేయాలి.

దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

First published:

Tags: CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION

ఉత్తమ కథలు