హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

FCI Recruitment 2021 : ఎఫ్‌సీఐలో ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 860 ఉద్యోగాలు.. జీతం రూ. 23,000

FCI Recruitment 2021 : ఎఫ్‌సీఐలో ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 860 ఉద్యోగాలు.. జీతం రూ. 23,000

ఎఫ్‌సీఐ రిక్రూట్‌మెంట్ 2021

ఎఫ్‌సీఐ రిక్రూట్‌మెంట్ 2021

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 860 వాచ్‌మెన్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 860 వాచ్‌మెన్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ (Online) ప‌ద్ధ‌తిలో ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. పోస్టులకు ఎంపికైన అభ్య‌ర్థికి నెల‌కు రూ.23,000 నుంచి రూ. 64,000 జీతం చెల్లిస్తారు.  ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు అప్లికేష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.

  ముఖ్య‌మైన స‌మాచారం..

  పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌లువ‌య‌సుజీతం
  వాచ్‌మెన్860ఐదు, ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దివి ఉండాలిసెప్టెంబ‌ర్ 1, 2021 నాటికి 25 ఏళ్లు నిండ‌కూడ‌దురూ.23,000 నుంచి రూ.64,000


  APPSC Recruitment 2021 : ఏపీపీఎస్సీలో నాన్ గెజిటెడ్‌ ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు విధానం


   ఎంపిక విధానం..

  - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థికి రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

  - రాత ప‌రీక్ష 120 మార్కుల మ‌ల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌లు ఉంటాయి.

  - ప‌రీక్ష ఇంగ్లీష్‌, హిందీ, పంజాబీలో నిర్వ‌హిస్తారు.

  - ప‌రీక్ష‌లో ఎటువంటి నెగెటీవ్ మార్కింగ్ లేదు.

  - మెరిట్ ద్వారా ఎంపికైన వారిని పోస్టులోకి తీసుకొంటారు.

  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

  Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.recruitmentfci.in/ ను సంద‌ర్శించాలి.

  Step 3 :  వెబ్‌సైట్‌ల Category IV Recruitment లింక్‌లోకి వెళ్లాలి.

  Step 4 :  అనంత‌రం నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  IIT Kanpur Recruitment 2021 : ఐఐటీ కాన్పూర్‌లో 95 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హ‌తలు ఇవే


  Step 5 :  అర్హ‌త‌లు అన్ని చూసుకొన్న త‌రువాత ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి https://fci-punjab-watch-ward.in/login లింక్‌లోకి వెళ్లాలి.

  Step 6 :  అనంత‌రం కుడివైపు పైన Register Here క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు విధానాన్ని ప్రారంభించాలి.

  Step 7 :  క్లిక్ చేసిన త‌రువాత ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌లు వ‌స్తాయి. చ‌ద‌వాలి.

  Step 8 :  ఇన్‌స్ట్ర‌క్ష‌న్ చ‌ద‌విన త‌రువాత కింద చెక్ బాక్స్ టిక్ చేసి Apply Now లోకి వెళ్లాలి.

  Step 9 :  పేరు, ఫోటో ఐడీ, ఈమెయిల్‌, మొబైల్ నంబ‌ర్ ఇచ్చి అనంత‌రం విద్యార్హ‌త‌లు ఇవ్వాలి.

  Step 10 :  రిజిస్ట్రేష్ట్రష‌న్ పూర్తియిన త‌రువాత రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

  Step 11 :  ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

  Step 12 :  ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Govt Jobs 2021, Job notification, JOBS

  ఉత్తమ కథలు