హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Father’s Day 2021: వర్క్ ఫ్రం హోం చేసే ఫాదర్లు పిల్లలతో ఇలా గడపండి.. నిపుణుల నాలుగు సూత్రాలివే....

Father’s Day 2021: వర్క్ ఫ్రం హోం చేసే ఫాదర్లు పిల్లలతో ఇలా గడపండి.. నిపుణుల నాలుగు సూత్రాలివే....

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వర్క్ ఫ్రం హోం చేస్తున్న తల్లిదండ్రులు ఈ 4 విషయాలను గుర్తించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ నాలుగు పాయింట్లు మీ కోసం..

ఈ రోజు ఫాదర్స్ డే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. నడక నేర్పిన నాన్నకు వారి పిల్లలు గిఫ్ట్ లు అందించి వారిలో ఆనందం నింపుతున్నారు. ఇదిలా ఉంటే.. చిన్నారుల తల్లిదండ్రులు సైతం ఈ ఫాదర్స్ డే సందర్భంగా అనేక పద్ధతులు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని పిల్లలతో చనువు పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని చెబుతున్నారు. అయితే అనేక మంది పేరెంట్స్ వర్క్ ఫ్రం హోం సమయంలోనూ ఉద్యోగ సమయం ముగిసిన అనంతరం సైతం ఫోన్ తప్పా.. పిల్లలను పెద్దగా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారిందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న తల్లిదండ్రులు వారి కుటుంబం మరియు పిల్లలతో విలువైన సమయాన్ని గడపడానికి సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం..

Fathers Day 2021: ఈ 6 సూత్రాలతో తండ్రుల ఆరోగ్యం పదిలం

1. పని కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించండి:

వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేసేటప్పుడు కేవలం పనికే పరిమితం కాకుండా పిల్లలతోనూ సమయాన్ని గడపడం కూడా అంతే ముఖ్యం. దీంటో ఇంట్లో పనితో పాటు ఆట కోసం కూడా ప్రత్యేక స్థలాన్ని కేటాయించండి. దీంతో మీరు పని వాతావరణం నుంచి బయటపడవచ్చు. ఆట కోసం కేటాయించిన ప్రదేశంలో మీ పిల్లలతో కలిసి సరదాగా గడపవచ్చు.

2.ఆఫీస్ పని లేనప్పుడు కంప్యూటర్ / ల్యాప్‌టాప్‌ను ఉపయోగించవద్దు:

వర్క్ ఫ్రం హోం కారణంగా పని గంటలు పెరిగాయని అనేక మంది చెబుతున్నారు. కొంత మంది పని లేకపోయినా అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు. అయితే పని గంటలు సాధ్యమైనంత మేర తగ్గించుకోవాలని, పని లేనప్పుడు కంప్యూటర్ ముందు గడపడం మానాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం కారణంగా ఆఫీసుకు వెళ్లడం, తిరిగిరావడానికి చేసే జర్నీ సమయం తగ్గింది కాబట్టి.. ఆ సమయాన్ని పిల్లలతో గడపాలని నిపుణులు చెబుతున్నారు

3.పిల్లలకు కొత్త అంశాలు నేర్పించండి:

కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు బంద్ అవ్వడంతో దాదాపు విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పేరెంట్స్ కూడా వర్క్ ఫ్రం చేస్తుండడంతో పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం ఏర్పడింది. అయితే ఈ సమయంలో పిల్లలకు వంట నేర్పడం, ఇంటిని శుభ్రం చేయడం లాంటి పనులను అలవాటు చేయడం నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న కొత్త కొత్త కోర్సులను వెతికి నేర్పించే ప్రయత్నం చేయాలని వారు సూచిస్తున్నారు.

4.పిల్లలతో కలిసి భోజనం చేయండి:

మీకు ఆఫీస్, పిల్లలకు స్కూల్/కాలేజీ ఉన్నప్పుడు పిల్లలతో కలిసి భోజనం చేయడం అనేక సార్లు కుదరదు. అయితే.. వర్క్ ఫ్రం హోం సమయంలో మీరు, మీ పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి వారితో కలిసి భోజనం చేయడం. పిల్లలను సంతోష పెట్టడానికి వారికి తినిపించడం, కలిసి భోజనం చేయడం దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: Fathers Day, Fathers Day 2021, Work From Home

ఉత్తమ కథలు