తమిళనాడుకు చెందిన 67 ఏళ్ల వ్యక్తి ఏకంగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE)-2021 పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. సంవత్సరాల తరబడి క్లాసులు విన్న విద్యార్థులకు సైతం సాధ్యంకాని గేట్ పరీక్షలో ఆయన ఉత్తీర్ణులయ్యారు. దీంతోపాటు ఈ సంవత్సరం గేట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అతి పెద్ద వయసున్న వ్యక్తుల్లో ఒకరిగా కూడా రికార్డు సాధించారు. ఆయనే తమిళనాడుకు చెందిన శంకరనారాయణన్ శంకరపాండ్యన్. ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) రంగంలో పరిశోధన చేయాలనేది తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. హోలోగ్రామ్‌లను తయారు చేయడానికి ఉపయోగించే ఆక్యులేషన్ (Occlusian) టెక్నాలజీపై పరిశోధన చేస్తానని చెప్పారు. IIT- మద్రాస్ లేదా అన్నా యూనివర్సిటీలో రిసెర్చ్ చేయాలని పాండ్యన్ భావిస్తున్నారు.
Online Startup Ideas: ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించాలా? ఈ 10 ఐడియాలు మీకోసమే
Work From Home Jobs: ఆన్లైన్లో డబ్బు సంపాదించండి ఇలా
శంకరనారాయణన్ తమిళనాడులోని హిందూ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఈ సంవత్సరం జరిగిన గేట్ పరీక్షల్లో మ్యాథ్స్ పేపర్లో 338, కంప్యూటర్ సైన్స్‌లో 482 మార్కులు సాధించారు. ఈ రెండు స్పెషలైజేషన్లతో పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. M.Tech కోర్సుల్లో ప్రవేశానికి, PSUల్లో ఉద్యోగాలకు అభ్యర్థులు గేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. గేట్ తరువాత పెద్ద డిగ్రీలు తీసుకోవడం, మంచి జీతంతో ఉద్యోగం పొందడం తనకు ఇష్టం లేదని పాండ్యన్ చెబుతున్నారు. కొత్త విషయంపై పరిశోధన చేసి, జ్ఞానాన్ని పెంచుకోవడమే తన లక్ష్యమని వివరించారు. అందువల్ల ఈ పరీక్ష విషయంలో పెద్దగా కంగారు పడలేదన్నారు. ఒకవేళ ఫెయిల్ అయినా, మళ్లీ ప్రయత్నించేవాడినని చెప్పారు.
Work From Home Jobs: నెలకు రూ.30,000 సంపాదించండి... వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవే
Work From Home Jobs: మీకు ఈ 6 స్కిల్స్ ఉన్నాయా? ఇంటి నుంచే జాబ్ చేయొచ్చు
GATE పరీక్షకు వయో పరిమితి లేదు. శంకర నారాయణన్ 1987లో ఒకసారి గేట్ రాసి.. IIT-ఖరగ్‌పూర్‌లో అడ్మిషన్ పొందారు. ఈ సంవత్సరం పరీక్షకు 30 రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టారు. 35 సంవత్సరాల క్రితం రాసిన గేట్ ఎగ్జామ్‌కు, ఈ సంవత్సరం రాసిన పరీక్షకు చాలా తేడా ఉందని చెప్పారు. GATE-2021లో కేవలం 17.8 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. వీరిలో శంకర నారాయణన్ ఒకరు. గేట్ రాసిన అత్యంత పెద్ద వయసున్న వ్యక్తిగా వేరొకరి పేరుతో రికార్డు ఉంది. గత సంవత్సరం 88 ఏళ్ల సివిల్ ఇంజినీర్ ఒకరు గేట్ పరీక్షకు హాజరయ్యి రికార్డు సాధించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, JOBS, VIRAL NEWS