హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Fake Universities: నకిలీ యూనివర్సిటీలపై యూజీసీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు.. వివరాలిలా..

Fake Universities: నకిలీ యూనివర్సిటీలపై యూజీసీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు.. వివరాలిలా..

Fake Universities: నకిలీ యూనివర్సిటీలపై యూజీసీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు.. వివరాలిలా..

Fake Universities: నకిలీ యూనివర్సిటీలపై యూజీసీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు.. వివరాలిలా..

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (University Grants Commission) తాజాగా నకిలీ యూనివర్సిటీల(Fake Universities) కొత్త జాబితాను విడుదల చేసింది. దీంతో పాటు ఈ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు తీసుకోవడం మానుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (University Grants Commission) తాజాగా నకిలీ యూనివర్సిటీల(Fake Universities) కొత్త జాబితాను విడుదల చేసింది. దీంతో పాటు ఈ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు తీసుకోవడం మానుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ నకిలీ యూనివర్సిటీలను కమిషన్ ఎలా గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటుందన్న కొన్ని ప్రశ్నలకు యూజీసీ చైర్మన్(UGC Chairman) ఎం జగదీష్ కుమార్ సమాధానమిచ్చారు.

నకిలీ విశ్వవిద్యాలయం అంటే ఏమిటి..?

ఈ ప్రశ్నపై యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ.. యూజీసీ చట్టం ప్రకారం ఏర్పాటు చేయని ఏ సంస్థ అయినా లేదా యూనివర్సిటీలు అయినా నకిలీ కిందకే వస్తాయి. యూనివర్సిటీలకు ప్రభుత్వం విధించిన షరతులను ఉల్లంఘించి డిగ్రీలు ప్రదానం చేసినా నకిలీ సంస్థలేనన్నారు.

Anganwadi Jobs in AP: ఏపీలోని మహిళలకు శుభవార్త.. ఆ జిల్లాలో అంగన్ వాడీఉద్యోగాలు .. ఇలా దరఖాస్తు చేసుకోండి

UGC నకిలీ విశ్వవిద్యాలయాలను ఎలా గుర్తిస్తుంది..?

నకిలీ విశ్వవిద్యాలయాలను ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా UGC దృష్టికి వస్తాయి. పబ్లిక్ లేదా విద్యార్థుల నుండి ఫిర్యాదుల స్వీకరణ, రాష్ట్రం/UT/స్థానిక అధికారుల నుండి సూచనలు, కోర్టు నిర్ణయాలు మొదలగు వాటి ద్వారా తాము తనిఖిలు చేపడతామన్నారు. UGC యొక్క యాంటీ మాల్‌ప్రాక్టీస్ సెల్ (AMPC) 30 మే 1996 నుండి పనిచేస్తోందని.. ఇది నకిలీ యూనివర్సిటీలు, డిగ్రీల బెడదను అరికట్టడమే దీని లక్ష్యం అని పేర్కొన్నారు.

UGC చట్టాన్ని ఉల్లంఘిస్తూ నడుస్తున్న నకిలీ లేదా గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలు/సంస్థలకు సంబంధించిన అన్ని విషయాలతో AMPC వ్యవహరిస్తోంది. AMPC నకిలీ మరియు గుర్తింపు లేని సంస్థలను తనిఖీ చేయడానికి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల వివిధ ఏజెన్సీలతో అనుసంధానం చేస్తుంది. UGC చట్టం , ఇతర శిక్షా చట్టాలను ఉల్లంఘించినందుకు అటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు/UTలు అండ్ స్థానిక అధికారులను కూడా అభ్యర్థిస్తుంది.

నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా ఇలా..

ప్రస్తుతం UGC రూపొందించిన నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాలో 21 నకిలీ విశ్వవిద్యాలయాలు/సంస్థలు ఉన్నాయి. ఇది అధికారిక వెబ్‌సైట్  https://www.ugc.ac.in/page/Fake-Universities.aspx లో కూడా అందుబాటులో ఉన్నాయి.

MLHP Posts In Telangana: 32 జిల్లాల వ్యాప్తంగా మిడ్‌ లెవెల్‌ పోస్టుల భర్తీ.. ఏ ఏ జిల్లాకు ఎన్ని పోస్టులున్నాయంటే..

ఢిల్లీ..

1. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPHS) అలీపూర్, ఢిల్లీ

2.కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్, దర్యాగంజ్, ఢిల్లీ

3.యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ, ఢిల్లీ

4.వొకేషనల్ యూనివర్శిటీ, ఢిల్లీ

5. ADR-సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్సిటీ, ADR హౌస్, 8J, గోపాల టవర్, 25 రాజేంద్ర ప్లేస్, న్యూ ఢిల్లీ

6.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, న్యూఢిల్లీ

7.విశ్వకర్మ ఓపెన్ యూనివర్శిటీ, GTK డిపో, ఢిల్లీ

8.స్పిరిచువల్ యూనివర్శిటీ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం), రితాలా, రోహిణి, ఢిల్లీ

కర్ణాటక

9. బార్గన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, గోకాక్, బెల్గాం

కేరళ

10.జాన్స్ యూనివర్శిటీ, కిషనట్టం

మహారాష్ట్ర

11.రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, నాగ్‌పూర్

పశ్చిమ బెంగాల్

12.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా.

13.కోల్‌కతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, ఠాకూర్‌పుర్కూర్, కోల్‌కతా

ఉత్తర ప్రదేశ్

14. గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్, అలహాబాద్.

15. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్.

16. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్శిటీ (ఓపెన్ యూనివర్శిటీ), అచల్తాల్, అలీఘర్, ఉత్తరప్రదేశ్ .

17. భారతీయ శిక్షా పరిషత్, భారత్ భవన్, మతియారి చిన్హాట్, ఫైజాబాద్ రోడ్, లక్నో, ఉత్తరప్రదేశ్.

ఒడిషా

18. నవభారత్ శిక్షా పరిషత్, అనుపూర్ణ భవన్, ప్లాట్ నెం. 242, పానీ ట్యాంకి రోడ్, శక్తినగర్, రూర్కెలా.

19.నార్త్ ఒరిస్సా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, మయూర్ భంజ్, ఒడిషా.

పుదుచ్చేరి

20. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నెం. 186, థిలాస్‌పేట్, వజుతావూర్ రోడ్.

ఆంధ్ర ప్రదేశ్

21. క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, గుంటూరు .

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Fake jobs, JOBS, UGC, University, University Grants Commission

ఉత్తమ కథలు