ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంపిక చేసుకున్న వారికోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET)ను జాతీయ స్థాయిలో నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఏడాదిలో రెండు సార్లు జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయిన వారు సీబీఎస్‌ఈ అనుబంధ స్కూళ్లలో ప్రైమరీ, ఎలిమెంటరీ లెవల్స్‌లో టీచర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. అయితే ఇటీవల జరిగిన సీటెట్- 2022 డిసెంబర్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఓ నోటీస్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఎస్‌ఈ స్పందించింది.
సీటెట్-2022 డిసెంబర్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటీస్ ఫేక్ అని సీబీఎస్‌ఈ తాజాగా నిర్ధారించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. ఇప్పటికే సీటెట్-2022 డిసెంబర్ పరీక్ష ఫలితాలను మార్చి 3న ప్రకటించామని, పరీక్షలో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని, ఇలాంటి వాటిని అసలు నమ్మొద్దని అభ్యర్థులకు ట్వీట్ ద్వారా సూచించింది.
సీటెట్‌లో రెండు పేపర్స్
సీటెట్‌లో రెండు పేపర్స్ ఉంటాయి. ప్రైమరీ లెవల్, అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించడానికి పేపర్ -1 పరీక్ష రాయాలి. ఇక ఎలిమెంటరీ లెవల్, అంటే ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠాలు బోధించాలనుకునే వారు పేపర్-2 రాయాలి. అభ్యర్థులు రెండు పేపర్స్ లేదా ఒకదానికి కూడా హాజరుకావచ్చు.
మార్చి 3న ఫలితాలు
సీ-టెట్ 2022 డిసెంబర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2022 నవంబర్ 24న ముగిసింది. పరీక్షను డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7 వరకు సీబీటీ మోడ్‌లో నిర్వహించారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఫిబ్రవరి 14న జారీ చేశారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలపడానికి ఫిబ్రవరి 17 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తరువాత మార్చి 3న ఫైనల్ ఆన్సర్ కీతో పాటు ఫలితాలను అధికారిక పోర్టల్ ctet.nic.inలో విడుదల చేశారు.
ఎంత మంది అర్హత సాధించారంటే?
సీటెట్- 2022 పేపర్-1 కోసం 17,04,282 మంది అప్లై చేసుకోగా.. 14,22,959 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 5,79,844 మంది అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్-2 కోసం 15,39,464 మంది దరఖాస్తు చేసుకోగా.. 12,76,071 మంది హాజరయ్యారు. వీరిలో 3,76,025 మంది అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు.
@cbseindia29 Public may please note that CTET result has already been declared by the board on 3.3.23 pic.twitter.com/Us52srSHWt
— CBSE HQ (@cbseindia29) March 10, 2023
డిజిటల్ ఫార్మాట్‌లో సర్టిఫికేట్స్
సీటెట్- 2022 స్కోర్‌కార్డ్, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్‌ను అభ్యర్థులకు వారి DigiLocker ఖాతా ద్వారా డిజిటల్ ఫార్మాట్‌లో సీబీఎస్ఈ అందిస్తుంది. ఇవి డిజిటల్ సైన్‌తో వస్తాయి. ఐటీ యాక్ట్ ప్రకారం, ఇవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా మార్క్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Ctet, JOBS, Students