స్టూడెంట్స్.. అది ఫేక్ న్యూస్.. తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు..

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి,మే 18 నుంచి మే 25 వరకు పదో తరగతి పరీక్షలంటూ షెడ్యూల్‌ను వాట్సప్‌లోకి వదిలారు. దీంతో అది వైరల్‌గా మారిందని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.

news18-telugu
Updated: May 9, 2020, 7:25 PM IST
స్టూడెంట్స్.. అది ఫేక్ న్యూస్.. తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు..
వారిని కూడా పరీక్షలు లేకుండా పాస్‌చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
  • Share this:
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోన్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు హెచ్చరించారు. ఈనెల 15వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలంటూ ప్రచారం చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యేలా వదంతులు సృష్టించారు. ఈసారి వదందులతో ఆగకుండా ఏకంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి,మే 18 నుంచి మే 25 వరకు పదో తరగతి పరీక్షలంటూ షెడ్యూల్‌ను వాట్సప్‌లోకి వదిలారు. దీంతో అది వైరల్‌గా మారిందని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. నిందితులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావొద్దని విద్యాశాఖ కమిషనర్ కోరారు.
Published by: Narsimha Badhini
First published: May 9, 2020, 7:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading