• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • FAILED IN COMPETITIVE EXAMS YOU CAN STILL GET GOVERNMENT JOB KNOW HOW SS

Govt Jobs 2021: పోటీ పరీక్షలో ఫెయిల్ అయినా గవర్నమెంట్ జాబ్... పొందొచ్చు ఇలా

Govt Jobs 2021: పోటీ పరీక్షలో ఫెయిల్ అయినా గవర్నమెంట్ జాబ్... పొందొచ్చు ఇలా

Govt Jobs 2021: పోటీ పరీక్షలో ఫెయిల్ అయినా గవర్నమెంట్ జాబ్... పొందొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Govt Jobs 2021 | ప్రభుత్వ ఉద్యోగం మీ కలా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం పోటీ పరీక్షలు రాస్తున్నారా? ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినా జాబ్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునేవారికి గుడ్ న్యూస్. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే పోటీ పరీక్షలో క్వాలిఫై కావాలి. ఆ తర్వాతి దశల్లో కూడా పాస్ కావాలి. అన్ని పరీక్షలు పాస్ అయితేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB లాంటి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఈ సంస్థలు నిర్వహించే అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూ పాస్ అయితేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఏ పరీక్ష ఫెయిల్ అయినా మళ్లీ ట్రై చేయాల్సిందే. అయితే ఈ పరీక్షలు ఫెయిల్ అయినా ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చు. ఎన్ని స్టేజెస్‌లో ఎగ్జామ్ పాస్ అయ్యారు అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. వాటిని బట్టి పబ్లిక్ సెక్టార్ సంస్థలు, స్వయంప్రతిపత్తిగల సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమిస్తారు.

    Railway Jobs: రైల్వే జాబ్ మీ కలా? నైరుతి రైల్వేలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

    RRB NTPC Admit Card 2020: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డ్స్ వచ్చేశాయి... డౌన్‌లోడ్ చేయండి ఇలా

    పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్, అటానమస్, స్టాచ్యుటరీ బాడీస్, సొసైటీస్, స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సంస్థలు యూపీఎస్‌సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్‌బీ ఎంపిక చేయనివారిలో తగిన అభ్యర్థులను నియమించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. పోటీ పరీక్షల్లో అన్ని దశలు క్లియర్ చేయనివారికి ఇది మంచి అవకాశం. టాలెంట్ ఉన్నవారిని నియమించుకోవడానికి ఆయా సంస్థలకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయి. పోటీ పరీక్షలు రాసినవారి డేటా బేస్ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖకు చెందిన నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో ఉంటుంది.

    Jobs: మజగాన్ డాక్‌లో 410 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Jobs: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 జాబ్స్... దరఖస్తుకు మరో 5 రోజులే గడువు

    అసలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే ఓ అభ్యర్థి యూపీఎస్‌సీలో ఏదైనా పోస్టుకు దరఖాస్తు చేశాడనుకుందాం. మూడు దశల పరీక్ష క్వాలిఫై అయితేనే ఆ ఉద్యోగం వస్తుంది. రెండు దశల పరీక్ష పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో మెరిట్ లిస్ట్‌లో లేకపోతే ఉద్యోగం రాదు. దీంతో అప్పటివరకు పడ్డ కష్టమంతా వృథా అయినట్టే. అయితే ఆ పోస్టుకు తగ్గ టాలెంట్ చూపించలేదు కాబట్టి ఉద్యోగం రాలేదు. ఇలా యూపీఎస్‌సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్‌బీ లాంటి సంస్థలు నిర్వహించిన పరీక్షల్లో ఉద్యోగం పొందనివారి డేటా నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో ఉంటుంది. ఆ అభ్యర్థి టాలెంట్‌కు తగ్గ మరో ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉండొచ్చు. ఇతర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీలు ఉంటే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో అభ్యర్థుల వివరాలు చెక్ చేస్తారు. అందులో ఎవరైనా అభ్యర్థులకు ఖాళీగా ఉన్న ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ ఉంటే సమాచారం అందిస్తారు. అప్పుడు ఆ ఉద్యోగానికి మళ్లీ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉండవు.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు