Fact Check: విద్యార్థులకు రూ. లక్ష స్కాలర్ షిప్.. ఈ పథకంలో నిజమిదే!

Fact Check: దేశంలో కరోనా కేసులతో పాటు ఫేక్ వార్తల సంఖ్య సైతం నిత్యం పెరుగుతూనే ఉంది. కొన్ని పోస్టుల్లో ఉన్న సమాచారం తప్పని తెలియక అనేక మంది ఇతరులకు షేర్ చేస్తున్నారు.

news18-telugu
Updated: September 28, 2020, 8:06 PM IST
Fact Check: విద్యార్థులకు రూ. లక్ష స్కాలర్ షిప్.. ఈ పథకంలో నిజమిదే!
ప్రతీకారాత్మక చిత్రం
  • Share this:
దేశంలో కరోనా కేసులతో పాటు ఫేక్ వార్తల సంఖ్య సైతం నిత్యం పెరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో నిత్యం అనేక తప్పుడు సమాచారం కలిగిన పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. ఆ పోస్టుల్లో ఉన్న సమాచారం తప్పని తెలియక అనేక మంది ఇతరులకు షేర్ చేస్తున్నారు.

ఇటీవల ఇలాంటి ఫేక్ పోస్టు ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నేషనల్ స్కాలర్ షిప్ పరీక్ష ద్వారా ప్రతిభ గల విద్యార్థులకు రూ. లక్ష స్కాలర్ షిప్ అందిస్తోందని ఆ పోస్టు సారాంశం. ఆ అంశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించడం కోసం ఎలాంటి పరీక్ష నిర్వహించలేదని స్పష్టం చేసింది. ఈ సంవత్సరం జూన్ లోనూ నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ కాలేజీ విద్యార్థులకు రూ. 10 వేలు స్కాలర్ షిప్ అందిస్తోందని ఒక ఫేక్ పోస్టు ఇంటర్ నెట్లో హల్ చల్ సృష్టించింది.


సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి గత సంవత్సరం డిసెంబర్ లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెకింగ్ విభాగాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ విధానాలు, పథకాలపై సోషల్ మీడియాలో సంచరించే తప్పుడు పోస్టులను గుర్తించడమే లక్ష్యంగా అది పనిచేస్తోంది.
Published by: Nikhil Kumar S
First published: September 28, 2020, 7:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading