FACT RECRUITMENT 2020 FERTILISERS AND CHEMICALS TRAVANCORE LIMITED INVITES APPLICATIONS FOR 98 POSTS APPLY BEFORE FEBRUARY 28 SS
Jobs: ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌లో 98 జాబ్స్... ఫిబ్రవరి 28 లాస్ట్ డేట్
Jobs: ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌లో 98 జాబ్స్... ఫిబ్రవరి 28 లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)
FACT Recruitment 2020 | ఐటీఐ పాసైనవారికి అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. భారతీయ రైల్వేతో పాటు అనేక సంస్థలు వేర్వేరు ట్రేడ్స్‌లో ఐటీఐ పూర్తిచేసినవారికి అప్రెంటీస్ పోస్టుల ద్వారా అవకాశాలిస్తున్నాయి. ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్‌కోర్ లిమిటెడ్-FACT ఐటీఐ పాసైనవారి నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది.
ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్‌కోర్ లిమిటెడ్-FACT ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 98 ఖాళీలను ప్రకటించింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, వెల్డర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 ఫిబ్రవరి 28 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://fact.co.in/ వెబ్సైట్లో చూడొచ్చు. అభ్యర్థులు ముందుగా రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అధికారిక వెబ్‌సైట్స్ (www.ncvtmis.gov.in లేదా www.apprenticeship.gov.in) లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
FACT Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 98
ఫిట్టర్- 24
మెషినిస్ట్- 8
ఎలక్ట్రీషియన్- 15
ప్లంబర్- 4
మెకానిక్ మోటార్ వెహికిల్- 6
కార్పెంటర్- 2
మెకానిక్ డీజిల్- 4
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 12
వెల్డర్- 9
పెయింటర్- 2
COPA / ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్- 12
FACT Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 28
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. 60% మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50% మార్కులతో పాసైతే చాలు.
వయస్సు- 2020 జనవరి 1 నాటికి 23 ఏళ్లు
స్టైపెండ్- ఏడాది శిక్షణ కాలంలో నెలకు రూ.7,000.
అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్‌కోర్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.