హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Free Laptop Scheme: విద్యార్థులకు అలర్ట్.. ఈ ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్‌తో తస్మాత్ జాగ్రత్త!

Free Laptop Scheme: విద్యార్థులకు అలర్ట్.. ఈ ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్‌తో తస్మాత్ జాగ్రత్త!

 కొండెక్కిన కోడ్

కొండెక్కిన కోడ్

Laptop Scheme | విద్యార్థులకు అలర్ట్.. ఈ ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్‌తో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మోసగాళ్లు ఫేక్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్ధులను బురిడీ కొట్టిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Pradhan Mantri National Laptop Scheme | ప్రధాన్ మంత్రి నేషనల్ ల్యాప్‌టాప్ స్కీమ్ అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు (Students) ఉచితంగానే ల్యాప్‌టాప్ (Laptop) అందిస్తోందనే మెసేజ్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ స్కీమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టూడెంట్స్ ఇలాంటి పథకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్‌ను తీసుకురాలేదు. అందువల్ల విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్ లేనే లేదని విశ్వసించాలి. అప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఉచిత ల్యాప్‌టాప్ పథకాలను నమ్మకుండా ఉండొచ్చు. అందువల్ల ఎవరికైనా ఉచిత ల్యాప్‌టాప్ పథకం అంటూ మెసేజ్‌లు వస్తే.. దాన్ని నమ్మవద్దు. వెంటనే అలాంటి మెసేజ్‌లను డిలేట్ చేయండి. లేదంటే సైబర్ పోలీసులకు అందించండి.

ఈరోజు నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. దీపావళి ముందు కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఆర్‌బీఐ!

ప్రధాని మోదీ ఫోటోతో ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్ అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 11వ తరగతి చదివే వారి నుంచి గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థుల వరకు ఉచిత ల్యాప్‌టాప్ పొందొచ్చని ఇందులో ఉంది. ఈ అంశంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ దర్యాప్తు చేసింది. ఇందులో నిజం లేదని వెల్లడించింది. అందువల్ల కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.

ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఫోన్ కొంటే రూ.10 వేల డిస్కౌంట్

A website 'https://t.co/YwKnUPKbbV' is claiming to offer free laptops to Class XI - graduate students in the name of 'Prime Minister National Laptop Scheme 2022' #PIBFactCheck

▶️The Website is #Fake

▶️The Government of India is not running any such scheme pic.twitter.com/yZk1V3tA7H

— PIB Fact Check (@PIBFactCheck) October 10, 2022

పీఐబీ టీమ్ ప్రకారం.. ప్రధాన్ మంత్రి నేషనల్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2022 అనేది లేనే లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీమ్ కాదని గుర్తించుకోవాలి. వైరల్ అవుతున్న మెసేజ్‌పై కేంద్ర ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని కోరింది. లేదంటే బ్యాంక్ అకౌంట్‌ మాయం అవుతుంది. అంటే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. డబ్బులను మోసగాళ్లు కొట్టేసే అవకాశం ఉంటుంది. అందువల్ల మోసపూరిత మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలి.

పీఎంఎస్ఎస్‌గౌ.ఆన్‌లైన్ అనేది ఫేక్ వెబ్‌సైట్. దీని ద్వారా ఉచితంగానే ల్యాప్‌టాప్స్ పొందొచ్చనే మెసేజ్ వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దాన్ని వెంటనే డిలేట్ చేయండి. మీ వివరాలను అందించొద్దు. ఇతరులకు ఇలాంటి వాటిని ఫార్వర్డ్ చేయొద్దు. అంతేకాకుండా ఈ ఫేక్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలంటే రూ. 450 చెల్లించాల్సి ఉంటుంది.  అందువల్ల మీరు ఈ వెబ్‌సైట్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఎలాంటి నిజం లేదని గ్రహించాలి. లేదంటే మాత్రం అకౌంట్‌లో డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది.

First published:

Tags: JOBS, Laptops, Students

ఉత్తమ కథలు