హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వే ఉద్యోగాల కోసం జరగబోయే పరీక్షలు రద్దు.. నిజమెంత ?

Railway Jobs: రైల్వే ఉద్యోగాల కోసం జరగబోయే పరీక్షలు రద్దు.. నిజమెంత ?

Railway Jobs: రైల్వే ఉద్యోగాల కోసం జరగబోయే పరీక్షలు రద్దు.. నిజమెంత ?

Railway Jobs: రైల్వే ఉద్యోగాల కోసం జరగబోయే పరీక్షలు రద్దు.. నిజమెంత ?

Fact check News: రైల్వే ఉద్యోగాల పరీక్షకు సంబంధించిన ఓ ఫేక్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  సోషల్ మీడియా వేగంగా విస్తరించిన ప్రస్తుత తరుణంలో వాస్తవాల కంటే అసత్య వార్తలే ఎక్కువ వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటి వల్ల ఇబ్బంది పడే వ్యక్తులు, సంస్థలు ఆ తరువాత వాటిపై వివరణ ఇచ్చుకుంటున్నాయి. తాజాగా రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన ఇలాంటి ఫేక్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రైల్వేల్లోని వివిధ విభాగాల్లో 1,40,640 ఖాళీల భర్తీకి సంబంధించి తొలి దశ పరీక్షను డిసెంబర్ 15 నుంచి నిర్వహిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. దీనిపై రైల్వే ఉన్నతాధికారులతో పాటు రైల్వేమంత్రి పీయూష్ గోయల్ కూడా స్పష్టత ఇచ్చారు.


  అయితే తాజాగా ఈ పరీక్షలు రద్దు అయినట్టు ఓ పత్రికలో వార్త వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టు చక్కర్లు కొడుతోంది. దీనిపై కేంద్ర సమాచార శాఖ స్పందించింది. రైల్వే ఉద్యోగాల పరీక్షల రద్దు నిర్ణయం తాము తీసుకోలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ఎవరో మార్ఫింగ్ చేసినదని క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని.. డిసెంబర్ 15 నుంచి ఆన్‌లైన్ టెస్టులు ఉంటాయని తెలిపింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Exams, Indian Railways, RRB

  ఉత్తమ కథలు