హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Fact Check: ఇంటలిజెన్స్ బ్యూరోలో 2 వేల ఉద్యోగాలు.. తెలంగాణ, ఏపీలోనూ ఖాళీలు.. ఈ నోటిఫికేషన్ నిజమేనా?

Fact Check: ఇంటలిజెన్స్ బ్యూరోలో 2 వేల ఉద్యోగాలు.. తెలంగాణ, ఏపీలోనూ ఖాళీలు.. ఈ నోటిఫికేషన్ నిజమేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియాలో నిజమైన వార్తలతో పోటీ పడుతూ ఫేక్ వార్తలు సైతం హల్ చల్ చేస్తున్నాయి. నిత్యం ఎక్కడ చూసినా ఓ అబద్ధపు వార్త కనిపిస్తోంది. తాజాగా ఇలాంటి ఓ ఫేక్ జాబ్స్ నోటిఫికేషన్ ఒకటి ఇంటర్ నెట్లో హల్ చల్ చేసింది.

సోషల్ మీడియాలో నిజమైన వార్తలతో పోటీ పడుతూ ఫేక్ వార్తలు సైతం హల్ చల్ చేస్తున్నాయి. నిత్యం ఎక్కడ చూసినా ఓ అబద్ధపు వార్త కనిపిస్తోంది. ఇలాంటి ఫేక్ వార్తలను సృష్టించి, సైబర్ క్రైమ్ కు పాల్పడుతూ డబ్బులు అక్రమంగా సంపాధిస్తున్న వారు కొందరైతే.. ఇతరులను ఫూల్స్ చేస్తూన్నామని రాక్షస ఆనందం పొందే వారు మరి కొందరు. యాడ్స్ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించే వెబ్ సైట్లు సైతం ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫేక్ జాబ్స్ నోటిఫికేషన్ ఒకటి ఇంటర్ నెట్లో హల్ చల్ చేసింది. ఏకంగా ఇంటలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు ఉన్నాయంటూ ఓ తప్పుడు నోటిఫికేషన్ కాపీని సృష్టించారు కొందరు కేటుగాళ్లు.

మొత్తం రెండు వేల ఖాళీలు ఉన్నాయంటూ కేటగిరీల వారీగా ఉద్యోగాల సంఖ్యను సైతం ఈ తప్పుడు నోటిఫికేషన్లో ప్రకటించారు. రాష్ట్రాల వారీగా ఖాళీలను సైతం ముద్రించారు. అయితే ఈ తప్పుడు నోటిఫికేషన్ పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరాలు సేకరించింది. ఇలాంటి నోటిఫికేషన్ ఏదీ విడుదల కాలేదని స్పష్టం చేసింది.

ఇలాంటి ప్రకటనలు నమ్మి మోసపోవద్దని సూచించింది. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి గత సంవత్సరం డిసెంబర్ లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెకింగ్ పేరిట ఓ విభాగాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ విధానాలు, పథకాలపై సోషల్ మీడియాలో సంచరించే తప్పుడు పోస్టులను గుర్తించడమే లక్ష్యంగా అది పనిచేస్తోంది.

First published:

Tags: Fact Check

ఉత్తమ కథలు