దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా దేశవ్యాప్తంగా అనేక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)–2022 పరీక్ష కూడా వాయిదా పడిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా దేశవ్యాప్తంగా అనేక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE)–2022 పరీక్ష కూడా వాయిదా పడిందనే వార్తలు సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు అభ్యర్థుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. పరీక్ష నిజంగానే వాయిదా పడిందా? లేదా? అనే విషయం తెలియక సతమతమవుతున్నారు. గేట్–2022 పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి ఇటీవల వచ్చిన ఒక ప్రకటన అభ్యర్థుల్లో మరింత గందరగోళానికి కారణమైంది. ఐఐటీ(IIT) ఖరగ్‌పూర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం,“గేట్ పరీక్షలో పాల్గొనే అభ్యర్థుల ఆరోగ్యం, భద్రత మాకు చాలా ముఖ్యం. ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా పరీక్ష తేదీలు మారవచ్చు. లేదంటే గేట్–2022 పరీక్ష వాయిదా పడవచ్చు. అవసరమనుకుంటే రద్దు కూడా కావచ్చు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత గేట్ పరీక్ష నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం.” అని ఉంది.
అయితే దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్–19 ఆంక్షల కారణంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడంలో ఉన్న ఇబ్బందులను హైలైట్ చేస్తూ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇందుకోసం #postponegate2022 అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్..
గేట్ 2022 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 24,000 మంది అభ్యర్థులు గతంలో ఆన్లైన్ పిటిషన్‌ను ప్రారంభించారు. “ప్రస్తుత మూడవ వేవ్‌తో, కోవిడ్–19 దాని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనేక రాష్ట్రాలు, నగరాల్లో తీవ్రంగా వ్యాపించింది. ఐఐటీ కాన్పూర్‌తో సహా అనేక అధ్యయనాలు ఫిబ్రవరి ప్రారంభంలో మూడవ వేవ్ గరిష్ట స్థాయిని తాకవచ్చని, ఏప్రిల్ నాటికి థర్డ్‌వేవ్ ముగుస్తుందని అంచనా వేశాయి. కోవిడ్ గరిష్ట స్థాయి తాకే సమయంలోనే గేట్ పరీక్ష ఉన్నందున అభ్యర్థులు కోవిడ్ భారీన పడే అవకాశం ఉంది. అందువల్ల, పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నాం.”అని పిటిషనర్లు ఆన్లైన్లో డిమాండ్ చేస్తున్నారు.
స్పష్టతనివ్వని ఐఐటీ ఖరగ్‌పూర్..
కాగా, గేట్–2022 అడ్మిట్ కార్డ్ విడుదల రెండుసార్లు వాయిదా పడింది. దీంతో, పరీక్ష వాయిదా పడబోతుందని చాలా మంది విద్యార్థులు భావిస్తున్నారు. అంతేకాకుండా, మహమ్మారి పరిస్థితిని సమీక్షిస్తున్నామని, త్వరలోనే పరీక్ష వాయిదాపై నిర్ణయం ప్రకటిస్తామని ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీరేంద్ర కుమార్ తివారీ గతంలో ప్రకటించారు. దీంతో, పరీక్ష వాయిదాపై ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. ఏదేమైనప్పటికీ, పరీక్ష తేదీల్లో ఇప్పటివరకు ఎటువంటి మార్పు లేదు. గేట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదని అభ్యర్థులు గమనించాలి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.