FACT CHECK DID SUPREME COURT HAS APPROVED A LOGO FOR THE TEACHERS TO PUT ON THEIR VEHICLES SS
Fact Check: టీచర్ల కార్లపై ఈ లోగో పెట్టుకోవచ్చా? నిజమేంటో తెలుసుకోండి
Fact Check: టీచర్ల కార్లపై ఈ లోగో పెట్టుకోవచ్చా? నిజమేంటో తెలుసుకోండి
Fact Check | డాక్టర్లు, లాయర్ల లాగా టీచర్లు కూడా తమ వాహనాలపై లోగో అతికించుకోవచ్చని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు మెసేజ్ వైరల్ అవుతోంది. అందులో నిజమేంటో తెలుసుకోండి.
టీచర్లు తమ వాహనాలపై పెట్టుకునేందుకు సుప్రీం కోర్టు లోగో ఆమోదించిందన్న మెసేజ్ బాగా వైరల్ అవుతోంది. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. డాక్టర్లు, లాయర్ల లాగా టీచర్లు కూడా తమ కార్లపై ఈ లోగోను అతికించుకోవచ్చన్నది ఆ మెసేజ్ సారాంశం. "Teacher A Nation Builder. I want, I can, I will" అని ఆ లోగోలో కనిపిస్తోంది. ఇప్పుడు కాదు... రెండుమూడేళ్లుగా ఈ మెసేజ్ వాట్సప్‌లో తిరుగుతూనే ఉంది. మరి నిజంగానే టీచర్లు తమ వాహనాలపై పెట్టుకోవడానికి సుప్రీం కోర్టు లోగోను ఆమోదించిందా? భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీనిపై అధికారికంగా వివరణ ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్ అని, సుప్రీం కోర్టు అలాంటి ఆదేశాలు ఏదీ ఇవ్వలేదని స్పష్టం చేసింది.
మరి ఈ లోగో ఎక్కడిది? ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారు? అని చెక్ చేస్తే అసలు విషయాలు తెలుస్తాయి. పంజాబ్‌లోని లుధియానాలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ రాజేష్ ఖన్నా ఈ లోగోను 2017 సెప్టెంబర్‌లో తయారు చేయించారు. టీచర్స్ డే సందర్భంగా తయారు చేయించిన లోగో అది. విద్యారంగంలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయుల కోసం ఆయన స్వయంగా ఈ లోగోను తయారు చేయించారు. అంతే తప్ప ఈ లోగోను టీచర్లు అందరూ తమ వాహనాలపై అతికించుకోవచ్చని సుప్రీం కోర్టు ఎప్పుడూ చెప్పలేదు.