• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • FACT CHECK DID NRA ANNOUNCED RECRUITMENT FOR 8 LAKHS POSTS WITH OUT EXAM HERE IS TRUTH SK

Fact Check: 8 లక్షల జాబ్స్.. ఎగ్జామ్ లేకుండా రిక్రూట్‌‌మెంట్.. ఇది నిజమేనా?

Fact Check: 8 లక్షల జాబ్స్.. ఎగ్జామ్ లేకుండా రిక్రూట్‌‌మెంట్.. ఇది నిజమేనా?

(ప్రతీకాత్మక చిత్రం)

Fact Check: ఉద్యోగాలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (NRA) 8 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత?

  • Share this:
    ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ప్రతి యువతీ యువకుడి కల. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా.. ఏదైనా సరే.. ప్రభుత్వం ఉద్యోగం అయితే చాలు. కాలు మీద కాలేసుకొని బతకొచ్చని చాలా మంది భావిస్తారు. అందుకే ఏదైనా నోటఫికేషన్ విడుదలయితే లక్షల కొద్ది దరఖాస్తు వస్తాయి. ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి సన్నద్ధమవుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (NRA) 8 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తోందని ప్రచారం జరుగుతోంది.

    ''NRA 2021 నోటిఫికేషన్ విడుదలయింది. గ్రూప్ బీ, సీకి సంబంధించి 8లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి పరీక్ష ఉండదు. నేరుగా నియామకం చేపట్టారు. 2021లో ఇది అత్యద్భుత అవకాశం.'' అని యూట్యూబ్‌లో వీడియోలు కనిపిస్తున్నాయి. ఐతే ఈ ప్రచారంపై PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇందులో నిజంలేదని.. ఇది ఫేన్ న్యూస్ అని కొట్టిపారేసింది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.


    ఫేస్‌బుక్, ట్విటర్ ఓపెన్ చేస్తే చాలు.. ఏవేవో పోస్టులు కనిపిస్తున్నాయి. వేలాది వార్తలు దర్శనమిస్తాయి. ఇవి చాలదన్నట్లు వాట్సప్‌కు కుప్పలు తెప్పలుగా వార్తలు సందేశాల రూపంలో వస్తున్నాయి. మరి అందులో ఏవి నిజమైనవి? ఏవి తప్పుడు ప్రచారాలో.. తెలియక జనాలు తికమకపడుతున్నారు. సోషల్ కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే అసత్య ప్రచారాలను నిజమని నమ్ముతున్నారు. అందుకే వాట్సాప్‌లో వచ్చే ప్రతి వార్తనూ నమ్మవద్దు. ఇతర మీడియా విభాగాల్లో చెక్ చేసిన తర్వాతే ధృవీకరించుకోవాలి.

    కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు