వేలాది మంది ఉద్యోగుల తొలగింపులను మెటా (Meta) యొక్క CEO మార్క్ జుకర్‌బర్గ్ ధృవీకరించారు. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను (Twitter) వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా 13 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మెటా తొలగింపుల వల్ల 11,000 మందికి పైగా ఉద్యోగులు (Jobs) ప్రభావితమయ్యారని జుకర్‌బర్గ్ బుధవారం ఉద్యోగులకు (Employees) రాసిన లేఖలో పేర్కొన్నారు. మెటా చరిత్రలో అత్యంత కష్టమైన మార్పులు చేయాలని నిర్ణయించినట్లు జూకర్ బర్గ్ తెలిపారు. తమ టీమ్ సైజ్ ను 13 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు అంటే 11 వేలకు పైగా టాలెంటెబ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఖర్చులను తగ్గించడం, Q1 వరకు నియామకాలను నిలిపివేయడం ద్వారా మరింత సమర్థవంతమైన కంపెనీగా ఫేస్ బుక్ ను రూపుదిద్దనున్నట్లు వివరించారు. ఈ నిర్ణయాలనికి తాను బాధ్యత వహిస్తున్నానన్నారు. ఇది చాలా కఠినమైన నిర్ణయమని తనకు తెలుసన్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభావితం అవుతున్న వారి అందరికీ సారీ చెప్పారు జూకర్ బర్గ్.
కోవిడ్ ప్రారంభంలో, ప్రపంచం వేగంగా ఆన్‌లైన్‌లోకి వెళ్లిందన్నారు. ఈ-కామర్స్ విపరీతంగా పెరగడంతో ఆదాయ వృద్ధికి దారితీసిందన్నారు. మహమ్మారి ముగిసిన తర్వాత కూడా ఇది కొనసాగుతుందని అంతా భావించారన్నారు. అయితే ప్రస్తుతానికి ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం పడిపోడంతో ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు. 2004లో ఫేస్ బుక్ ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలను తొలగించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఒక్క రోజులో రూ.90 వేల కోట్లు హాంఫట్
ప్రస్తుతం మెటాలో దాదాపుగా 87 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక మాంద్యం వస్తుందంటూ ప్రపంచవ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్న వేళ సోషల్ మీడియా దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్యాసన పలకడం అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఫేస్ బుక్ బాటలోనే మరిన్ని టెక్ దిగ్గజాలు కూడా వెళ్తాయన్న వార్తలు ఆయా ఉద్యోగులకు ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి.
కంపెనీ నుంచి తొలగింపునకు గురైన ఉద్యోగులకు 16 వారాల పాటు వేతనం ఇవ్వనుంది సంస్థ. ఇంకా కంపెనీలో పని చేసిన సమయానికి సంవత్సరానికి రెండు వారాల చొప్పున అదనపు వేతనం చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఇంకా ఉద్యాసనకు గురైన ఉద్యోగతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ 6 నెలల పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కొనసాగుతుందని జుకర్ ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.