విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీజీ మెడికల్ ప్రవేశాలకు గడుపు పొడగింపు..

ఆగస్టు 31వ తేదీ వరకు తెలంగాణలోని వైద్య కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును పొడగిస్తున్నట్టు సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది.

news18-telugu
Updated: July 31, 2020, 7:46 AM IST
విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీజీ మెడికల్ ప్రవేశాలకు గడుపు పొడగింపు..
సుప్రీం కోర్టు
  • Share this:
తెలంగాణలోని వైద్య కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రవేశాల కోసం తక్కువ గడువు ఇచ్చారంటూ ప్రైవేటు మెడికల్ కాలేజీలు పేర్కొన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఇంత తక్కువ కాలంలో విద్యార్థులు చేరడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటూ ఈ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై గురువారం విచారించిన సుప్రీం కోర్టు పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ తెలంగాణలో మెడికల్ పీజీ ప్రవేశాలకు గడువు పెంచాలంటూ తీర్పు చెప్పింది. ఆగస్టు 31వ తేదీ వరకు తెలంగాణలోని వైద్య కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును పొడగిస్తున్నట్టు సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. వాస్తవానికి పీజీ కోర్సుల్లో విద్యార్థులు ప్రవేశం పొందేందుకు చాలా రకాలుగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందంటూ కోర్టు అభిప్రాయపడింది.

తెలంగాణ ప్రభుత్వం, హెల్త్ యూనివర్సిటీ విధించిన గడువు ఏమాత్రం సరిపోదని, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందులో భాగంగానే పీజీ కోర్సుల్లో చేరేందుకు గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం, హెల్త్ యూనివర్సిటీకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Published by: Narsimha Badhini
First published: July 31, 2020, 7:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading