Home /News /jobs /

EXTENSION OF DEADLINE FOR APPLICATIONS FOR TELANGANA MINORITY RESIDENTIAL SCHOOLS EXAMINATIONS WILL START FROM MAY 9 GH VB

TMREIS Admissions: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అప్లికేషన్స్‌కు గడువు పొడిగింపు.. ఆ రోజు నుంచి పరీక్షలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని మైనారిటీ పాఠశాల్లో అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకునే తుది గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ వివరాలను తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) తాజాగా వెల్లడించింది.

తెలంగాణలోని(Telangana) మైనారిటీ పాఠశాల్లో అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకునే తుది గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ వివరాలను తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) తాజాగా వెల్లడించింది. రాష్ట్ర మైనారిటీల రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈ సంవత్సరం అడ్మిషన్ల కోసం ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అభ్యర్థులు TMREIS అధికారిక వెబ్‌సైట్ tmreis.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పాఠశాలల్లో 5వ తరగతిలో విద్యార్థుల ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. 2022-2023 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతిలోని మైనారిటీ కేటగిరీ బ్యాక్‌లాగ్ ఖాళీల కోసం కూడా గడువును పొడిగించారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 11న ప్రారంభమైంది.

* TREMIS పరీక్ష తేదీ
5వ తరగతికి సంబంధించిన పరీక్ష మే 9న.. 6, 7, 8 తరగతులకు మే 10న పరీక్ష జరగనుంది. పరీక్ష ఫలితాలు మే 23న విడుదల చేసి మే 26 నుంచి జూన్ 6 మధ్య అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

* TREMIS అడ్మిషన్లకు అర్హత ప్రమాణాలు
రాష్ట్రంలో మొత్తం 204 TMR సంస్థలు ఉన్నాయి. ఇందులో బాలురకు 107, బాలికలకు 97 క్యాంపస్‌లు ఉన్నాయి. అడ్మిషన్లకు అర్హత పొందాలంటే, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి కుటుంబ ఆదాయం రూ. 1.5 లక్షల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతానికి చెందిన విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలి.

* ఎలా దరఖాస్తు చేయాలి?
స్టెప్- 1
TMREIS హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. నోటిఫికేషన్స్ విభాగాన్ని ఓపెన్ చేయండి.

Astrology | Zodiac signs: ఈ రాశుల వారు సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.. వీ రాశి చెక్ చేసుకోండి..


స్టెప్ - 2
పోర్టల్‌లో తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ స్కూల్ కోసం దరఖాస్తు ఫారమ్ - 2022 వ కోసం చూడండి. దాని కింద ఉన్న 'Apply Online' బటన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్- 3
అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి. అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. దరఖాస్తుదారులు TMR స్కూల్స్ కోసం మూడు ప్రాధాన్యతలను కూడా ఇవ్వవలసి ఉంటుంది.

స్టెప్- 4
తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేసి.. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని సేవ్ చేయండి. అలాగే అప్లికేషన్ నంబర్‌ను నోట్ చేసుకోండి.

అభ్యర్థులు తమ అప్లికేషన్లను TMREIS అధికారిక మొబైల్ యాప్ ద్వారా కూడా సమర్పించవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అడ్మిట్ కార్డ్
అప్లికేషన్స్ సబ్‌మిట్ చేసిన తర్వాత, అభ్యర్థులు తమ రసీదు/హాల్ టిక్కెట్‌ను TMREIS వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, దరఖాస్తుదారుని పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Schools, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు