Home /News /jobs /

EXPECTING CUT OFF FOR THE UNDERGRADUATE COURSES ACROSS COLLEGES AND VARSITIES IN INDIA HERE IS AN UPDATE TAKE A LOOK GH SRD

Cut-Off Marks: టాప్‌ వర్సిటీల్లో అడ్మిషన్ కటాఫ్‌ లిస్ట్‌ ఎప్పుడు ప్రకటిస్తారు? అడ్మిషన్లు ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cut-Off Marks: CUET 4వ దశ పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ సంవత్సరం కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. భారతదేశంలోని కళాశాలలు, వర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరేందుకు కటాఫ్ మార్కు‌లు ఎప్పుడు ప్రకటిస్తారో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఈ ఏడాది నుంచి యూనివర్సిటీలు(Universities), కాలేజీల్లో ప్రవేశాలకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) రావడంతో అడ్మిషన్ ప్రక్రియ మారింది. మొదటి సంవత్సరంలో CUET ద్వారా 86 విశ్వవిద్యాలయాలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇందులో ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University), జామియా మిలియా ఇస్లామియా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU), అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, జామియా హమ్‌దార్ద్, TISS, BHU, అలహాబాద్ యూనివర్సిటీ వంటి కొన్ని ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి. కలకత్తా యూనివర్సిటీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ వంటి వర్సిటీలు 12వ తరగతి మార్కులు లేదా సొంత ప్రవేశ పరీక్షల ఫలితాల ద్వారా అడ్మిషన్లు చేపడుతున్నాయి.

CUET 4వ దశ పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ సంవత్సరం కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. భారతదేశంలోని కళాశాలలు, వర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరేందుకు కటాఫ్ మార్కు‌లు ఎప్పుడు ప్రకటిస్తారో తెలుసుకుందాం.

* ఢిల్లీ యూనివర్సిటీ
ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లోని అడ్మిషన్ పూర్తిగా CUET స్కోర్‌లపై ఆధారపడి ఉంటుంది. CUET ఆధారంగా కటాఫ్, ర్యాంక్ లిస్ట్ ప్రకటిస్తారు. సెయింట్ స్టీఫెన్స్, జీసస్, మేరీ వంటి మైనారిటీ కళాశాలలకు కూడా CUET ద్వారా ప్రవేశాలు జరగాలని ఢిల్లీ వర్సిటీ నిర్ణయించింది. CUET ఫలితాలు వెలువడిన తర్వాత సెంట్రలైజ్డ్‌ కౌన్సెలింగ్ సమయంలో, అనుబంధ కళాశాలల రిజర్వేషన్ విధానం ప్రకారం అన్‌రిజర్వ్‌డ్, మైనారిటీ అభ్యర్థులకు ప్రత్యేక మెరిట్ జాబితాలు రూపొందిస్తారు.

* జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)
ఈ వర్సిటీ కూడా CUET ద్వారా ప్రవేశాలను నిర్వహిస్తుంది. ఇంతకుముందు JNU సొంత ప్రవేశ పరీక్ష JNUEE ద్వారా విద్యార్థులను చేర్చుకుంది. CUET ఉపసంహరించుకోవాలని, మునుపటి ప్రక్రియకు తిరిగి వెళ్లాలని విశ్వవిద్యాలయాన్ని కోరుతూ JNU ఉపాధ్యాయుల సంస్థ JNUTA ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే వర్సిటీ ఈ విద్యా సంవత్సరానికి సెంట్రల్ పరీక్షను కొనసాగించింది.

* జామియా మిలియా ఇస్లామియా (JMI)
ఈ వర్సిటీ 223 రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను అందిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, డిప్లొమా స్థాయిలలో దూరవిద్య కోర్సులను కూడా అందిస్తుంది. 2021 వరకు దాదాపు అన్ని కోర్సులలో ప్రవేశం కోసం, జామియా ప్రవేశ పరీక్షలను నిర్వహించేది. అయితే ఈ సంవత్సరం నుంచి సాధారణ UG కోర్సులకు CUET ద్వారా ప్రవేశాలు కల్పించనుంది.

* బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU)
బనారస్‌ హిందూ యూనివర్సిటీ కూడా CUET ద్వారా అడ్మిషన్లను కల్పించనుంది. ఇంతకు ముందు సొంత ప్రవేశ పరీక్ష BHU UET ద్వారా ప్రవేశాలు కల్పించేది. హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్, సైన్స్, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌తో సహా అనేక విభిన్న కోర్సులను అందిస్తుంది. ఇందులో మూడు ఇన్‌స్టిట్యూట్‌లు, 140 విభాగాలు, నాలుగు ఇంటర్ డిసిప్లినరీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 10 పరిశోధనా కేంద్రాలు కూడా ఉన్నాయి.

* కలకత్తా యూనివర్సిటీ
కలకత్తా యూనివర్సిటీ CUET ద్వారా అడ్మిషన్లు కల్పించడం లేదు. యూజీ అడ్మిషన్‌లకు గడువు ఆగస్టు 5. మాస్టర్స్, పీహెచ్‌డీ, డిప్లొమా కోర్సులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. అనుబంధంగా ఉన్న కాలేజీల సీట్ల కేటాయింపు ప్రస్తుతం కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి :తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్

* యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH)
ఈ వర్సిటీలో CUET ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇంతకు ముందు యూనివర్సిటీ అందించే అన్ని కోర్సులకు అడ్మిషన్ జూన్‌లో ప్రారంభమై ఆగస్టు నాటికి ముగిసేది. సెప్టెంబరు ప్రారంభంలోనే CUET ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నందున, ఆ తర్వాత అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

* జాదవ్‌పూర్ యూనివర్సిటీ
వర్సిటీలో UG, PG, PhD స్థాయిలలో 130 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి. జాదవ్‌పూర్ యూనివర్సిటీ సొంత ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఈ ఏడాది దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసి ప్రస్తుతం ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తోంది. ఫలితాలు, మెరిట్ జాబితాలు ఈ నెలలోనే వెలువడే అవకాశం ఉంది. విద్యార్థులు వారి అకడమిక్ రికార్డు, ప్రవేశ పరీక్షలో మార్కుల ఆధారంగా ప్రవేశం పొందుతారు. BTech కోసం అడ్మిషన్లు WBJEE ద్వారా జరుగుతుండగా, వాటి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Cuet, Delhi University, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు