ఉన్నత విద్యపై కీలక నిర్ణయం.. ఈనెల 20 నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు..!

సకాలంలో కేంద్రం మార్గదర్శకాలు వస్తే ఆ విధంగా ముందుకు సాగాలని, లేకపోతే తెలంగాణలో ముందుగా ఆన్‌లైన్‌లో పాఠాలు ప్రారంభించాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 11, 2020, 8:39 AM IST
ఉన్నత విద్యపై కీలక నిర్ణయం.. ఈనెల 20 నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు..!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఉన్నత విద్యపై కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఉన్నత విద్యకు సంబంధించిన సిలబస్‌తో పాటు పని దినాలను సగానికి తగ్గించేందుకు యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. బుధవారం ఆయా కాలేజీల యాజమాన్యాలతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో పరీక్షల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా ముందుకు సాగితే బాగుంటుందని మెజార్జీ అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అయితే సకాలంలో కేంద్రం మార్గదర్శకాలు వస్తే ఆ విధంగా ముందుకు సాగాలని, లేకపోతే తెలంగాణలో ముందుగా ఆన్‌లైన్‌లో పాఠాలు ప్రారంభించాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

అనంతరం పరిస్థితుల ఆధారంగా ఆఫ్ లైన్ తరగతులను నిర్వహించడంపై నిర్ణయం తీసుకోవచ్చనే అభిప్రాయానికి వచ్చారు. ఇదిలావుంటే.. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు విదేశాలకు విద్య, ఉద్యోగాల కోసం వెళ్లాల్సి ఉంటుంది. అయితే వారికోసం ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. ఇదిలావుంటే.. సెప్టెంబరులో కాలేజీలు తెరిచినా హాస్టళ్లు తెరవొద్దని, భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుందని చర్చ జరిగింది. కాలేజీల ప్రారంభంతో పాటు ఇతర పరీక్షలు, డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించి ఈనెల 15న మరోసారి భేటీ కానున్నారు.
Published by: Narsimha Badhini
First published: June 11, 2020, 8:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading