నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(National Fisheries Development Corporation) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎక్జిక్యూట్ అసిస్టెంట్ (టెక్నికల్) విభాగంలో ఆరు పోస్టులు ఖాళీగా ఉండగా.. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్)లో ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ 24 అక్టోబర్, 2022న విడుదలైంది. దరఖాస్తులకు చివరి తేదీ నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి 30 రోజుల వరకు ఉంటుంది.
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా ‘‘చీఫ్ ఎగ్జిక్యూటివ్, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్, పిల్లర్ నెం. 235, PV ఎక్స్‌ప్రెస్‌వే, శ్వపంప పోస్ట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500082’’. దీనికి సంబంధించి పూర్తి వివరాల కొరకు ఈ https://nfdb.gov.in/ ను సందర్శించొచ్చు. అప్లికేషన్ ఫారమ్ అనేది నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఉండాలి. అప్లికేషన్ ఫారమ్ ను ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వయోపరిమితి..
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (టెక్నికల్) పోస్టులకు అర్హతలు..
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫిషరీస్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ /ఆక్వాకల్చర్/మారికల్చర్/మెరైన్ బయాలజీ/ఇండస్ట్రియల్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వీటితో పాటు.. రెండేళ్ల సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్) పోస్టులకు అర్హతలు ..
అభ్యర్థులు ఆర్ట్స్ / కామర్స్ / స్టాటిస్టిక్స్ / సైన్స్ / బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ / మేనేజ్ మెంట్ / కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వీటితో పాటు సంబంధిత పనిలో 2 ఏళ్ల పని అనుభవం ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9300 నుంచి రూ.34,800 వరకు చెల్లిస్తారు.
దీనికి సంబంధించి పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Jobs in telangana, Telangana government jobs