హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exclusive: తొలి ఎన్‌డీఏ ఎగ్జామ్‌లో 1,002 మహిళలు పాస్... కోర్సుకు 19 మంది ఎంపిక

Exclusive: తొలి ఎన్‌డీఏ ఎగ్జామ్‌లో 1,002 మహిళలు పాస్... కోర్సుకు 19 మంది ఎంపిక

Exclusive: తొలి ఎన్‌డీఏ ఎగ్జామ్‌లో 1,002 మహిళలు పాస్... కోర్సుకు 19 మంది ఎంపిక
(ప్రతీకాత్మక చిత్రం)

Exclusive: తొలి ఎన్‌డీఏ ఎగ్జామ్‌లో 1,002 మహిళలు పాస్... కోర్సుకు 19 మంది ఎంపిక (ప్రతీకాత్మక చిత్రం)

NDA Exam 2021 | ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎన్‌డీఏ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో వెయ్యి మందికి పైగా మహిళలు పాస్ అయ్యారు. వారిలో 19 మందిని వచ్చే ఏడాది నిర్వహించే కోర్సుకు ఎంపిక చేస్తారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నిర్వహించిన ఎగ్జామినేషన్‌లో వెయ్యి మందికి పైగా మహిళలు పాస్ అయ్యాయి. ఈ పరీక్షలు మొత్తం 8,000 మంది అభ్యర్థులు పాస్ అయితే వారిలో 1,002 మహిళలు ఉన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నవంబర్ 14న నిర్వహించిన పరీక్షలో తొలిసారి మహిళలు కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. వారిలో 1,002 మహిళా అభ్యర్థులు పాస్ అయ్యారు. వారంతా సర్వీస్ సెలెక్షన్ బోర్డ్‌ ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్టులు ఉంటాయి. వారిలో 19 మందిని వచ్చే ఏడాది నిర్వహించే ఎన్‌డీఏ కోర్సుకు ఎంపిక చేస్తారు. వారంతా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్లుగా చేరతారు.

ఎన్‌డీఏలో తొలిసారి 20 మంది వుమెన్ క్యాడెట్స్‌ని ఎంపిక చేస్తారని News18 మొదటిసారి వెల్లడించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఎన్‌డీఏ మొత్తం 400 మంది క్యాడెట్లను నియమించనుంది. వారిలో ఇండియన్ ఆర్మీకి 208 మందిని కేటాయిస్తారు. అందులో 10 మంది మహిలు ఉంటారు. ఇక ఇండియన్ నేవీకి 42 మందిని నియమిస్తే అందులో ముగ్గురు మహిళలు ఉంటారు. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్సులో 120 మందిని నియమిస్తే అందులో ఆరుగురు మహిళలు ఉంటారు.

BEL Recruitment 2021: హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్‌లో భారీగా ఉద్యోగాలు... రూ.50,000 వరకు వేతనం

రాజ్యసభలో వేసిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ సమాధానమిస్తూ ఈ పరీక్షకు వచ్చిన మొత్తం 5,75,856, దరఖాస్తుల్లో మహిళల నుంచి 1,77,654 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎన్‌డీఏ మౌలిక సదుపాయాలను మారుస్తోంది. బలమైన భద్రతా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తోంది. మహిళా బోధకుల్ని, వైద్యుల్ని నియమిస్తోంది. వారిలో గైనకాలజిస్టులు కూడా ఉన్నారు. సహాయక సిబ్బందిని కూడా నియమిస్తోంది. వచ్చే ఏడాది తొలిసారిగా మహిళా క్యాడెట్స్‌ని క్యాంపస్‌లోకి ఆహ్వానించేందుకు అనేక చర్యల్ని తీసుకుంటోంది.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ 1955 లో పూణెలోని ఖడకవాస్లాలో ఏర్పాటైంది. ప్రస్తుతం 18 స్క్వాడ్రన్ల సిబ్బంది ఉన్నారు. ప్రతీ స్క్వాడ్రన్‌లో 120 మంది క్యాడెట్స్ ఉంటారు. గత ఆరు టర్మ్స్‌లో ఈ సంస్థలో 2,020 క్యాడెట్స్ ఉండటం విశేషం. ప్రభుత్వ సమాచారం ప్రకారం ప్రతీ ఏటా నాలుగు ఎన్‌డీఏ ఎంట్రెన్స్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు ఆరు లక్షలకు పైగా అభ్యర్థులు హాజరవుతారని అంచనా. ఈ పరీక్షల్ని యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. ఎన్‌డీఏలో 120 నుంచి 150 మంది మహిళా క్యాడెట్లను చేర్చుకోవాలన్న ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నట్టు హెడ్‌క్వార్టర్స్ ఇండిగ్రేడెట్ డిఫెన్స్ స్టాఫ్ (HQ-IDS) లోని మాజీ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేడెట్ డిఫెన్స్ స్టాఫ్ (ACIDS) మేజర్ జనరల్ అరవింద్ భాటియా గతంలో News18 కి తెలిపారు.

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... దరఖాస్తు ప్రారంభం

కేంద్రం కోరుకున్నట్టు వచ్చే ఏడాది నుంచి కాకుండా ఈ ఏడాది నుంచే ఎన్‌డీఏలోకి మహిళల్ని చేర్చుకోవాలని సెప్టెంబక్‌లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటి వరకు మహిళా అధికారులు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA) నుంచి సైన్యంలో చేరారు. గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీల్లో చేరారు. ఇక ఇప్పటికే ఉన్న 18 స్క్వాడ్రన్లకు మరో 2 స్క్వాడ్రలను చేర్చనుంది ఎన్‌డీఏ. దీంతో ప్రతీ ఏటా చేరే మిలిటరీ క్యాడెట్లను సంఖ్య పెరగనుంది. రెండు స్క్వాడ్రన్ల ద్వారా 240 మంది అదనంగా చేరతారు.

First published:

Tags: CAREER, Career and Courses, Central Government Jobs, Govt Jobs 2021, Indian Air Force, Indian Army, Indian Navy, JOBS, NDA

ఉత్తమ కథలు