తెలంగాణలో కొలువుల జాతర నడుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో వరుస పెట్టి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి... ఇటీవల ఎక్సైజ్ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అధికారిక సమాచారం కోసం https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏం చదవాలి.. సిలబస్ వివరాలు తెలుసుకొని ప్రణాళికగా చదవివితే ప్రభుత్వ కొలువు సాధించడం సులభం.
అర్హతలు..
- విద్యార్హత ఇంటర్మీడియట్
- జూలై 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండి 22 ఏళ్లు దాటకుండా ఉండాలి. 2000 జూలై 2, కంటే ముందు పుట్టి ఉండకూడదు. జూలై 1, 2004 తర్వాత పుట్టి ఉండకూడదు.
- రెండేళ్ల కాలంలో 365 రోజులు విధులు నిర్వర్తించి, ఇప్పటికీ కొనసాగుతున్న హోంగార్డులైతే 18 ఏళ్ల వయసు నిండి 40 ఏళ్లు దాటకూడదు.
ప్రిలిమినరీ పరీక్ష సిలబస్ వివరాలు..
ప్రశ్నలు - 200
1. ఇంగ్లీష్
2. అంకగణితం
3. జనరల్ సైన్స్
4. భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం
5. భౌగోళిక శాస్త్రం, భారతీయ భౌగోళిక శాస్త్రం, రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క సూత్రాలు.
TS Police Job Preparation: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టైం టేబుల్ ట్రై చేయండి
6. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు
7. రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ పరీక్ష
8. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు.
ఫైనల్ పరీక్షకు సంబంధించి సెలబస్..
మార్కులు - 200
1. ఇంగ్లీష్
2. అంకగణితం
3. జనరల్ సైన్స్
4. భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం
5. భౌగోళిక శాస్త్రం, భారతీయ భౌగోళిక శాస్త్రం, రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క సూత్రాలు
6. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు
7. రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ పరీక్ష
8. వ్యక్తిత్వ పరీక్ష (ప్రశ్నలు నీతి, లింగానికి సంబంధించిన సున్నితత్వం మరియు బలహీనంగా ఉంటాయి
విభాగాలు, సామాజిక అవగాహన, ఎమోషనల్ ఇంటెలిజెన్స్)
9. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు..
ఫిజికల్ పరీక్షకు సంబంధించి..
- పురుషులకు 1600 మీటర్ల పరుగు 7ని. 15 సెకన్లలో పూర్తి చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ 800 మీటర్ల పరుగు 5ని.20 సెకన్లలో పూర్తి చేయాలి.
- పురుషుల ఎత్తు 167.6 సెంటీమీటర్లు ఉండాలి. మహిళలు ఎత్తు 152.5 సెంటీమీటర్లు ఉండాలి.
ఆదిలాబాద్, కొమరంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన ట్రైబ్ అభ్యర్థులయితే
పురుషులు 160 సెం.మీ, మహిళలు 150 సెంటీమీటర్ల ఎత్తు ఉంటే సరిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Police jobs, Telangana police jobs, Tslprb