హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exams: ఆల్ పాస్ అంటే కుదరదు.. ఆ విద్యార్థులందరికీ పరీక్షలు తప్పనిసరి.. అప్పటిలోగా నిర్వహించాలని కీలక ఆదేశాలు

Exams: ఆల్ పాస్ అంటే కుదరదు.. ఆ విద్యార్థులందరికీ పరీక్షలు తప్పనిసరి.. అప్పటిలోగా నిర్వహించాలని కీలక ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Final Year Students Exams: దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలకు అకడమిక్​ క్యాలెండర్, ఎగ్జామినేషన్​ షెడ్యూల్​ను విడుదల చేసింది. అన్ని యూనివర్సిటీలు యూజీ, పీజీ ఫైనలియర్ సెమిస్టర్​ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని కోరింది.

కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన విద్యా రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​ (యూజీసీ) 2021–2‌‌022 విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలకు అకడమిక్​ క్యాలెండర్, ఎగ్జామినేషన్​ షెడ్యూల్​ను విడుదల చేసింది. అన్ని యూనివర్సిటీలు యూజీ, పీజీ ఫైనలియర్ సెమిస్టర్​ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని కోరింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను బట్టి ఈ పరీక్షలను ఆన్​లైన్/ బ్లెండెడ్ (ఆన్​లైన్ లేదా ఆఫ్​లైన్) మోడ్​లో నిర్వహించుకోవచ్చని తెలిపింది. యూజీసీ ఆదేశాల మేరకు అన్ని యూనివర్సిటీలు ఆగస్టు 31లోగా ఈ టెర్మినల్​ సెమిస్టర్​/ ఫైనలియర్​ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ నిబంధన ఇంటర్మీడియట్​ ఫస్టియర్​, సెకండియర్​ విద్యార్థులకు వర్తించదు. ఆయా విద్యార్థులకు ఇంటర్నల్​ ఎవాల్యూషన్​ను బట్టి 50 శాతం, కిందటి ఏడాది మార్కులను బట్టి మరో 50 శాతం మార్కులు కేటాయించవచ్చని యూజీసీ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. స్థానికంగా ఉన్న కరోనా పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ఇంటర్మీడియట్ పరీక్షలను ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ / బ్లెండెడ్ మోడ్‌లో నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్​–19 సంబంధించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని కోరింది.

అక్టోబర్​ 1 నుంచి కొత్త అకడమిక్​ ఇయర్​..

ఇక, దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో 2021–22 నూతన అకడమిక్​ సెషన్​ అక్టోబర్​ 1 నుంచి ప్రారంభమవుతుందని యూజీసీ ప్రకటించింది. కొత్త అకడమిక్​ ఇయర్​కు సంబంధించిన అడ్మిషన్​ ప్రక్రియ సెప్టెంబర్​ 30లోపు పూర్తిచేయాలని కోరింది. సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ, రాష్ట్రాల బోర్డుల ఫలితాలు వెల్లడించిన అనంతరమే అండర్​ గ్రాడ్యుయేట్​ కోర్సుల అడ్మిషన్​ ప్రక్రియను ప్రారంభించాలని వర్సిటీలు, కాలేజీలను ఆదేశించింది. సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ, ఎస్​ఎస్​ఈ బోర్డుల క్లాస్ / గ్రేడ్- XII పరీక్షల ఫలితాలన్నీ జూలై 31లోపు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగితే కొత్త అకడమిక్​ ఇయర్​ అక్టోబర్​ 18 నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. అప్పటి పరిస్థితులను బట్టి ​తరగతులు, పరీక్షలు ఆన్​లైన్/ ఆఫ్​లైన్​లో దేనిలో నిర్వహించాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.

First published:

Tags: Degree exams