Exams Tips : ఇలా చేస్తే ఎగ్జామ్ టెన్షన్ మాయం

పరీక్షలనగానే చాలామంది ఫుల్‌గా టెన్షన్ పడుతుంటారు. ఆ టెన్షన్ కారణంగా వచ్చే స్కోర్ కూడా మిస్ చేసుకుంటారు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించండి..

news18-telugu
Updated: April 8, 2019, 3:43 PM IST
Exams Tips : ఇలా చేస్తే ఎగ్జామ్ టెన్షన్ మాయం
నీట్ ఎగ్జామ్‌లో టాపర్స్ వీరే
  • Share this:
సంవత్సరం మొత్తం చదివిన చదువు గురించి తెలియాలంటే రిజల్ట్స్‌ ద్వారానే చూస్తారు. మనం ఎంత చదివామన్నదానికంటే.. పరీక్షల్లో ఎంత బాగా రాశామన్నదే ముఖ్యం. మరి అలాంటి పరీక్షల్లో ఫుల్‌గా స్కోర్ చేయాలంటే మానసికంగా సిద్ధంగా ఉండాలి. టెన్షన్‌ని దరిచేరనివ్వకూడదు. అసలు మనం టెన్షన్ పడుతున్నామని తెలిపే లక్షణాలు, టెన్షన్ పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఒత్తిడి లక్షణాలు..

చిన్న విషయానికే కోపం రావడం, చిరాకుగా అనిపిస్తుంటుంది. నిద్ర త్వరగా రాదు.. ప్రతీ విషయానికి భయపడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో తల్లీదండ్రులు పిల్లల్ని గమనిస్తుండాలి. అదే విధంగా.. ఆకలిగా అనిపించదు.. తిన్న ఆహారం కూడా జీర్ణం కాదు..గుండె వేగంగా కొట్టుకుంటూ ఛాతిలో అసౌకర్యంగా ఉంటుంది. ఇలా అనిపించినప్పుడు వెంటనే కాసేపు చదువు పక్కనపెట్టి.. ఇష్టమైన పనిచేయాలి.

ఒత్తిడిని ఎదుర్కోవాలంటే..
* రోజూ ఏదేని వ్యాయామం, వాకింగ్, డాన్సింగ్, సైక్లింగ్ చేస్తుండాలి.
* అదేపనిగా చదవకూడదు.. చదువు మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి.
ఈ సమయంలోనే చదవాలి అన్న నియమం పెట్టుకోకూడదు.. ఎప్పుడు చదివితే బాగా గుర్తుంటుందో అప్పుడే చదవండి.కొన్నిసార్లు చదవాలనిపించదు.. అలాంటప్పుడు కాసేపు రిలాక్స్ అయి..ఇష్టమైన పని చేయండి. దీంతో మళ్లీ కొత్త ఉత్సాహం వస్తుంది.
కొన్ని సబ్జెక్ట్స్‌ని గ్రూప్స్ స్టడీ చేయడం వల్ల ఎక్కువ లాభముంటుంది.
ఇలా కొన్ని టిప్స్‌ని ఫాలో అవ్వడం వల్ల ఎగ్జామ్స్‌లో ఫుల్ స్కోర్ చేసే అవకాశముంటుంది.
First published: March 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading