Home /News /jobs /

EXAM TIPS STUDENT SHOULD TAKE CARE ABOUT PHYSICAL HEALTH AND MENTAL HEALTH SK

Exam Tips: పరీక్షలంటే టెన్షన్ వద్దు.. విద్యార్థులకు డాక్టర్ల సలహాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పాఠ్యాంశాలు బాగా చదివినప్పటికీ పరీక్షలో టెన్షన్ పడితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం కూడా చాలా అవసరమని సూచిస్తున్నారు.

    పరీక్షల సమయంలో మనం చదివే పాఠ్యాంశాలపై ఎంత దృష్టి పెడతామో.. అంతకు మించి మానసిక అంశాలపై కూడా దృష్టి పెట్టాలంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు ప్రభుకుమార్. పాఠ్యాంశాలు బాగా చదివినప్పటికీ పరీక్షలో టెన్షన్ పడితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం కూడా చాలా అవసరమని సూచిస్తున్నారు. ఒత్తిడిని జయించడానికి సరైన ప్రణాళికతో ప్రాక్టిస్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

    పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

    1. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఎక్కువ చదవడానికి తాపత్రయపడకుండా శరీరానికి తగిన విశ్రాంతినిస్తూ ప్రణాళికబద్ధంగా టైమ్ టేబుల్ సిద్ధం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

    2. పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఉండాలి. ఎప్పటి సబ్జెక్ట్స్ అప్పుడు చదువుకుంటూ పోతే పరీక్షల సమయానికి విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఉంటుంది.

    3. పరీక్షల సమయంలో కూడా ఆటలకి తగిన సమయం కేటాయించడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏం చదివిన వెంటనే గుర్తుంటుంది.

    4. విద్యార్ధులు తీసుకొనే ఆహారంపై కూడా తగిన శ్రద్ధ వహించడం మంచిది. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం వలన విద్యార్ధలకు మంచి ఫలితాలు వస్తాయి.

    5. ఎగ్జామ్స్ సమయంలో ముఖ్యంగా ఫోన్లు, టీవీలతో పాటు స్నేహితులతో చిట్ చాట్‌లకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది.

    6. మెడిటేషన్, యోగ వంటివి కూడా విద్యార్థుల్లో చురుకుదనాన్ని పెంచడానికి దోహదపడతాయి. విద్యార్థులకు వ్యాయామం వంటి అలవాటు లేకపోయిన పరీక్షల సమయంలో అలవాటు చేసుకుంటే మంచిది.

    స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయి. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగుస్తాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Exam Tips, Exams, Ssc exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు