Home /News /jobs /

EXAM TIPS HOW TO GET GOOD MARKS IN SSC MATHS HERE ARE SOME TIPS BA

Exam Tips | ఈ చిట్కాలతో పదోతరగతి గణితంలో మంచి మార్కులు సాధించొచ్చు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గణితంలో ప్రధానంగా ‘ప్రాబ్లమ్స్’ చేసేటప్పుడు వేరుగా రఫ్ పేపర్ పై కాకుండా జవాబు పత్రంపైనే రెండు వైపులా మార్జిన్ గీసుకుని కుడివైపు మార్జిన్ లో రఫ్ నోట్ రాసుకుంటే మంచిది.

    (ప్రసాద్, గణితం అధ్యాపకులు, రవీంద్రభారతి స్కూల్స్, హైదరాబాద్)

    పదోతరగతి అన్ని సబ్జెక్ట్ ల్లో గణితం అంటే చాలా మంది పిల్లలకు ఇష్టం. దాంతోపాటే చాలా మందికి గణితం అంటే భయం కూడా. అయితే మనం ప్రణాళికాబద్ధంగా ఈ సబ్జెక్ట్ మీద దృష్టి పెడితే మంచి మార్కులు సాధించవచ్చు అధ్యాపకులు ప్రసాద్.

    పరీక్ష రాసేటప్పుడు ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి

    • ఫైనల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు తప్పని సరిగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. అందులో ప్రధానంగా మీ చేతి రాత స్పష్టంగా ఉండే విధంగా చూసుకోండి.

    • జవాబు పత్రంపై కొట్టి వేతలు ఎక్కువగా ఉండకుండా చూసుకోండి.

    • గణితంలో ప్రధానంగా ‘ప్రాబ్లమ్స్’ చేసేటప్పుడు వేరుగా రఫ్ పేపర్ పై కాకుండా జవాబు పత్రంపైనే రెండు వైపులా మార్జిన్ గీసుకుని కుడివైపు మార్జిన్ లో రఫ్ నోట్ రాసుకుంటే మంచిది.

    • ముఖ్యమైన ఫార్ములాలన్నీ రోజూ ఒక సారి చూసుకోవడం ఉత్తమం. దీంతో పాటు జవాబు పత్రంపై అంకెలు రాసేటప్పుడు స్పష్టంగా రాయండి.

    • ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లడానికి ముందే పటాలు గీయడానికి అన్ని స్కేల్స్ దగ్గర పెట్టుకొని వెళ్లండి.


    స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.

    (ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Exam Tips, Exams, Ssc exams, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు