(సూచనలు: శిరీష, రవీంద్రభారతి ప్రిన్స్ పాల్ అండ్ బయాలజీ ఉపాధ్యాయురాలు)
పదో తరగతి పరీక్షలకు ఇంకా 45 రోజుల సమయం మాత్రమే ఉంది. పరీక్షలకు సరైన ప్రణాళికతో ప్రిపేర్ అయితే తప్పకుండా మంచి మార్కులు సాధించొచ్చంటున్నారు ఉపాధ్యాయులు. పదోతరగతి లో అతి ముఖ్యమైన సబ్జెక్ట్‌ల్లో బయాలజీ ఒకటి. అంతా అర్థమయినట్లు ఉంటుంది కానీ ఈ సబ్జెక్ట్‌లో కేర్ ఫుల్ గా ఉండకపోతే మార్కులు వదులుకోవాల్సి వస్తోందని అంటున్నారు రవీంద్రభారతి స్కూల్ ప్రిన్సిపాల్ శిరీష. బయాలజీలో ముఖ్యంగా ఈ క్రింది ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2. మొక్కలు ఆహారం తయారుచేసే విధానాన్ని నీవెలా అభినందిస్తావు?
3. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ ఆవశ్యకతను పటం సహాయంతో వివరించుము.
4. పోషకాహార లోపం వల్ల వచ్చే న్యూనతా వ్యాధులపై అవగాహన పెంచుకోవాలంటే డాక్టరు గారిని ఏఏ ప్రశ్నలు అడుగుతావు?
5. హరితరేణువును పటం సహాయంతో వివరించండి?
6. ఆకు యొక్క అడ్డుకోత పటం గీచి, భాగాలను గుర్తించుము.
7. ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియా ఎంజైముల పాత్ర గురించి రాయండి?
8. స్థూలకాయం వల్ల వచ్చే వ్యాధులు ఏవి?
9. హరిత రేణువులోని ఏ భాగంలో కాంతి చర్యలు నిష్కాంతి చర్యలు జరుగుతాయి?
10. విటమినులు అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి?
స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ... పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1న పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6న పరీక్షలు ముగియనున్నాయి.
(ఎం.బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్18)
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.