శిరీష (రవీంద్రభారతి స్కూల్ ప్రిన్స్ పాల్ అండ్ బయాలజీ ఉపాధ్యాయురాలు)
పదో తరగతి పరీక్షలకు ఇంకా 45 రోజుల సమయం మాత్రమే ఉంది. పరీక్షలకు సరైన ప్రణాళికతో సిద్ధమైతే తప్పకుండా మంచి మార్కులు సాధించొచ్చు. పదోతరగతి లో అతి ముఖ్యమైన సబ్జెక్టుల్లో బయాలజీ ఒకటి. అంతా అర్ధమయినట్లు ఉంటుంది కానీ, కేర్ ఫుల్ గా ఉండకపోతే మార్కులు వదులుకొవాలిస్తోందంటున్నారు రవీంద్రబారతీ స్కూల్ ప్రిన్సిపాల్ శీరీష. ముఖ్యంగా పరీక్షల్లో ఎక్కువగా విషయ అవగాహన ప్రశ్నలు ఉంటాయంటున్నారు. విద్యార్ధులకు సంబంధింత పాఠ్యాంశంపై ఏ మేరకు అవగాహన వచ్చిందో తెలుసుకునే విధంగా ప్రశ్నలు ఉంటాయని, అందుకని టెక్స్ట్ బుక్ లో ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే సులభంగా మార్కులు సాధించవచ్చు. ఆధునిక యుద్ధాలకు పారిశ్రామికీకరణ ఏ విధంగా కారణమైంది? అనే ప్రశ్న. ఇది విశ్లేషణాత్మక సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్న. ఇందుకోసం పాఠ్యపుస్తకాల్లో ఇచ్చిన సమాచారాన్ని జోడించి, విశ్లేషించాలి. దీంతోపాటు వార్తపత్రికల్లో వచ్చే వ్యాసాలు, వార్తలు చదివి ముఖ్యాంశాలు గుర్తుంచుకోవాలి. పదో తరగతి పరీక్షల్లో ఈసారి బిట్ పేపర్లో అడిగే ప్రశ్నల తీరు కూడా భిన్నంగా ఉండొచ్చు. పూర్తి స్థాయి సమాధాన ప్రశ్నలకే పరిమితం కాకుండా అసెర్షన్ అండ్ రీజన్ తరహా ప్రశ్నలు ఇచ్చే అవకాశముంది. విద్యార్థిలోని పరిశీలనాత్మక నైపుణ్యాలను పరీక్షించడమే ప్రధాన లక్ష్యంగా భావించడమే అందుకు కారణం.
సక్సెస్ టిప్స్
విషయ పరిజ్ఞానంతోపాటు, సమకాలీన అవగాహన, భావ వ్యక్తీకరణలకు ప్రాధాన్యం పెరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రస్తుత సమయంలో విద్యార్థులకు అనుకూలించే చిట్కాలు..
ప్రతి అంశంలోని మూల భావనలను, ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో పొందుపరచుకోవాలి.
వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే అవకాశమున్న అంశాలను గుర్తించి, వాటికి సంబంధించి సమకాలీన పరిణామాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి.
సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో చదివిన ప్రతిదీ కూడా సులభంగా అర్ధమవడానికి ఉపయోగపడుతుంది.
రాని అంశాలపై టైం వేస్ట్ చేయడం కంటే వచ్చిన అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయడం వలన విషయంపై అవగాహన పెరుగుతుంది.
పరీక్ష సమయంలో ముందుగా మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయడం మంచిది. అన్ని ప్రశ్నలు రాసిన తరువాత మీకు తెలియని ప్రశ్నలకు కూడా జవాబులు రాసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
ఎక్కువ చదివేయాలని ఆత్రుత వద్దు. ప్రశాంతంగా ఒక క్రమపద్ధతిలో ప్లాన్ చేసుకొని చదివితే తప్పకుండా మంచి స్కొర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
దీంతోపాటు పటాల ప్రశ్నలను కొత్త తరహాలో అడిగే అవకాశముంది. బొమ్మ ఇచ్చి అందులో ముఖ్య భాగాలు, వాటి ప్రాధాన్యతను వివరించమని అడగొచ్చు.
ముఖ్యంగా విద్యార్థులకు వచ్చే ఫలితాలు, గ్రేడ్లు, ఆలోచనను మైండ్లోంచి పూర్తిగా తొలగించాలి. పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది పాటిస్తూనే తమకు ఇష్టమైన సబ్జెక్టుతో ప్రిపరేషన్ మొదలుపెడితే మంచి ఫలితాలు ఉంటాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.