ప్రస్తుతం తెలంగాణ (Telangana) ప్రభుత్వం నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదలవడంతో నిరుద్యోగులు ప్రిపరేషన్ ను పరుగులు పెట్టిస్తున్నారు. ఇంకా.. పరీక్షల తేదీలు సైతం విడుదలవుతుండడంతో విద్యార్థులు సైతం అలర్ట్ అయ్యారు. ఒకప్పటిలా మొత్తం పుస్తకాలు కాకుండా ఆన్‌లైన్ క్లాస్‌లు (Online Class) , మెటీరియల్, చదవడం కూడా పెరిగిపోయింది. దీని ద్వారా విద్యార్థులు, అభ్యర్థులపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కంటిపై భారం పడి తొందరగా అలసిపోయి చదవు ఆపేస్తున్నారు.. ఈ సమయంలో విద్యార్థులు (Students) సాధారణంగా మంచి పోషకాహారం మరియు సరైన నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. వారి కళ్ళు, మెదడు, శరీరానికి ఇంధనం అందించడానికి, సమయానికి తినడం నిద్రపోవడం మరియు కంటి ఒత్తిడిని నివారించడం చాలా ముఖ్యం. పరీక్షల సమయంలో కంటి సంరక్షణ కోసం చిట్కాలు..!
చదివేటప్పుడు పాటించాల్సిన టిప్స్..
- చదివేటప్పుడు పుస్తకానికి కంటికి మధ్య కనీసం 25 సెంటీమీటర్ల దూరం పాటించండి. దీని ద్వారా కంటిపై బరువు తగ్గుతుంది.
- మీరు గంటల తరబడి చదివేటప్పుడు పదినిమిషాలకొకసారి విరామం తీసుకోండి.
- పరీక్షల సమయంలో తాజా పండ్లు కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
- కంటికి ఎక్కువగా బలాన్ని ఇచ్చే.. బీటా కెరోటిన్‌లో పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను ఆహారంతో ఉండేలా చూసుకోండి.
- ఎక్కువ సేపు కళ్లను రుద్దడం మానుకోవాలి. అందుకు బదులుగా చల్లటి నీటితో కంటిని కడుక్కోండి.
- ఆన్‌లైన్ క్లాస్‌లు, ప్రిపరేషన్ చేస్తుంటే తరచుగా కళ్లను నీటితో కడుక్కోవాలి.
- ఎక్కువ సేపు చదవాలంటే.. సరైన వెలుతురు ఉన్న గదిలో ప్రిపరేషన్ ప్రారంభించాలి.
- చాలా మంది జర్నిలో చదువుతుంటారు. అలా చేస్తే కళ్లు అలసిపోతాయి. కాబట్టి అలా చేయకండి.
- ఆన్‌లైన్‌లో చదువుతున్నప్పుడు, కళ్లను మెరుగ్గా ఉంచడానికి మానిటర్‌ను 45-డిగ్రీల కోణంలో ఏర్పాటు చేసుకొంటే మంచిది.
- నిరంతరం చదువుకోకుండా కాస్త విరామాలు ఉండేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి.
- రోజూ రెండున్నర లేదా 3 లీటర్ల నీరు తాగాలి.
- కూర్చొని నిరంతరం చదవకుండా.. కనీసం 45 నిమిషాలకు ఒకసారైనా లేచి రెండు నిమిషాలు నడవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exam Tips, Job notification, JOBS, Students