హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exam Stress: జేఈఈ, నీట్ అభ్యర్థులకు అలర్ట్.. ఒత్తిడిని దూరం చేసే వాట్సాప్ బేస్డ్ కోర్సు లాంచ్.. దీని ప్రత్యేకతలు..

Exam Stress: జేఈఈ, నీట్ అభ్యర్థులకు అలర్ట్.. ఒత్తిడిని దూరం చేసే వాట్సాప్ బేస్డ్ కోర్సు లాంచ్.. దీని ప్రత్యేకతలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్, నీట్ అభ్యర్థులపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయితే ఈ అభ్యర్థుల్లో స్ట్రెస్ పోగొట్టేందుకు పీక్‌మైండ్ (PeakMind) అనే ఒక ఎడ్యుటెక్ సంస్థ 'కంపీట్ (COMPETE)' అనే వాట్సాప్-బేస్డ్ కోర్సును ప్రారంభించింది.

పోటీ పరీక్షల్లో ఒత్తిడి(Stress)ని మేనేజ్ చేయగలగాలి. ఒత్తిడిని అదుపులో పెట్టుకోకపోతే పరిమిత సమయం గల పరీక్ష(Exams)ల్లో విద్యార్థులు మెరుగ్గా రాణించలేరు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళన ఉంటే విద్యార్థుల మెదడు ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్స్ కనిపెట్టలేదు. మరీ ముఖ్యంగా అత్యంత టాఫెస్ట్ ఎగ్జామ్స్ అయిన జేఈఈ మెయిన్, నీట్ అభ్యర్థులపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయితే ఈ అభ్యర్థుల్లో స్ట్రెస్ పోగొట్టేందుకు పీక్‌మైండ్ (PeakMind) అనే ఒక ఎడ్యుటెక్ సంస్థ 'కంపీట్ (COMPETE)' అనే వాట్సాప్-బేస్డ్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా అభ్యర్థులు తమ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ పెంపొందించుకోవచ్చు. తద్వారా పరీక్షల్లో మంచి స్కోర్ సాధించవచ్చు.

“ఈ కంపీట్‌ ప్రోగ్రామ్ విద్యార్థుల్లో ప్రొడక్టివిటీ, మైండ్ ఫుల్ నెస్ పెంచుతుంది. అలాగే ఒత్తిడి, భయాందోళన, పర్ఫామెన్స్ యాంగ్జైటీ వంటివి విద్యార్థుల నుంచి తొలగిస్తుంది. అభ్యర్థుల పర్ఫామెన్స్ మెరుగుదల కోసం క్విక్ స్ట్రాటజీలు అందించడమే ఇది లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ స్టంట్ హెల్ప్ కోసం విద్యార్థులు ఎప్పుడైనా కోచ్‌లను సంప్రదించవచ్చు. ప్రముఖ పాఠశాలలు, శిక్షణా సంస్థల నుంచి 5000 మందికి పైగా అభ్యర్థులు ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పటికే ప్రయోజనం పొందారు" అని ఎడ్యుటెక్ కంపెనీ పేర్కొంది.

కంపీట్‌ లైట్ ప్రోగ్రామ్‌ (COMPETE Lite Program)కి నెలకు రూ.499 చెల్లిస్తే సరిపోతుంది. మనీ చెల్లించాక కోచ్‌లు అభ్యర్థుల ప్రోగ్రెస్ అర్థం చేసుకోవడానికి ప్రతిరోజూ సమయాన్ని వెచ్చిస్తారు. విద్యార్థులు ఫేస్ చేసే సమస్యలను వీరు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సమర్థవంతమైన స్ట్రాటజీలను అనుసరిస్తారు. ఈ ప్రోగ్రాం లాంచ్ సందర్భంగా పీక్‌మైండ్ సీఈఓ నీరజ్ కుమార్ మాట్లాడుతూ, “పోటీ పరీక్షలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై చాలా ఒత్తిడి కలిగిస్తాయి. ఈ ప్రోగ్రామ్‌లు ప్రొడక్టివిటీ, ఫ్లెక్సిబిలిటీ, మెంటల్ స్ట్రెంత్, ఇంటెలిజెన్స్, ప్రైమ్ ఫ్రేమ్‌వర్క్‌తో మరిన్ని సాధించడానికి విద్యార్థిని అనుమతిస్తాయి." అని పేర్కొన్నారు.

Alzheimer’s Disease: అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే స్మార్ట్‌ యాప్‌.. ఆవిష్కరించిన అమెరికన్ పరిశోధకులు..


"ఈ వాట్సాప్ బేస్డ్ ప్రోగ్రామ్స్ విద్యార్థుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచి వారు ఎక్కువ స్కోర్ చేయడానికి దోహదపడతాయి. వీటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచడం పట్ల మేం సంతోషిస్తున్నాం. ఇది లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు వారి కలలను సాకారం చేసుకోవడానికి, వారి కృషికి ఫలితం అందించడానికి పునాది వేస్తుంది” అని సీఈఓ నీరజ్ తెలిపారు.

“పెరుగుతున్న పరీక్షల ఒత్తిడి, ఆందోళన, తక్కువ ఆత్మవిశ్వాసం వల్ల 60 శాతానికి పైగా విద్యార్థులు పరీక్ష సరిగా రాయలేక పోతున్నారని గత అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంకా, 45.1 శాతం మంది విద్యార్థులు ఆందోళనకు లోనవుతున్నారు. 29 శాతం మంది నిరాశకు లోనవుతున్నారు. దురదృష్టవశాత్తూ, ఈ లక్షణాలు తరచుగా గుర్తించలేం. ఇలాంటి ఒత్తిడి వల్ల వారి పూర్తి జీవితంపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది" అని పీక్‌మైండ్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

First published:

Tags: Career and Courses, NEET, NEET 2022, New course, Whatsapp

ఉత్తమ కథలు