ఇటీవల కాలంలో అకడమిక్ వార్షిక పరీక్షలో(Annual Exam) ఆత్మహత్యలు అప్పుడప్పుడూ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. అయితే 10, 12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్యూర్‌ను విద్యార్థులు భరించలేకపోవడం దీనికి ముఖ్య కారణం ఇంటి నుంచే కాకుండా.. సమాజం నుంచి కూడా వచ్చే ఒత్తిడి దీనికి కారణమని చెప్పవచ్చు. ఇలా ఫెయిల్యూర్(Failure), మానసిక ఒత్తిళ్ల కారణంగా మహారాష్ట్రలో 1834 మంది, మధ్యప్రదేశ్‌లో 1308 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తమిళనాడులో 1246 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. భారత్‌లో(India) మొత్తం ఇలా 13,089 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 10,732 మంది 18 ఏళ్ల లోపు వారే ఉన్నారు. పరీక్షలో ఫెయిల్ అయ్యి 864 మంది మాత్రమే ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం. గతేడాది 2020లో 12,526 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
వీరిలో పురుషులు- 55.62 శాతం ఉండగా.. మహిళలు- 44.38 శాతంగా ఉన్నారు. 2021లో 13,089 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో పురుషులు- 56.51 శాతం. మహిళలు- 43.49 శాతంగా గుర్తించారు. దీంతో విద్యార్థినుల కంటే మగ విద్యార్థులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకరి జ్ఞానాన్ని మార్కుల ద్వారా అంచనా వేయలేము. కానీ మార్కులే ఉన్నత చదువులకు, మంచి ఉద్యోగానికి మూలంగా మారాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో పరీక్షను ఎదుర్కోవాలి. పరీక్షలో స్కోర్‌లో విఫలమైనప్పుడు గిల్టీగా భావించాల్సిన అవసరం లేదు. మళ్లీ చదివి ఉత్తీర్ణత సాధించేందుకు ప్రయత్నించాలి. అందుకు విద్యార్థి, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం మెరుగుపడాలి.
పాఠాలు, చదువులు, పరీక్షలకు అతీతంగా ప్రపంచం ఎన్ని వింతల్లో ప్రవేశించిందో ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలి.సమాజంలో ధైర్యంగా జీవించగలిగేలా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి. ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేయాలి. పాఠశాల, కళాశాల పరీక్షల్లో ఫెయిలవడం అనేది కేవలం అజాగ్రత్త వల్ల కలిగే చిన్న పొరపాటు మాత్రమేనని విద్యార్థులు, యువత అర్థం చేసుకోవాలి. మీరు తప్పులు, వైఫల్యాలు, నష్టాలు, బలహీనతల నుండి తిరిగి పుంజుకోవచ్చు. పరీక్షలు, చదువుల్లో ఏదైనా వైఫల్యం చెందితే అది జీవితం ప్రభావం చూపకూడదు.
జీవితం కంటే ఇవి ఉన్నతమైనది కాదనే విషయాన్ని గమనించాలి. ఎన్ని అపజయాలు ఎదురైనా జీవించి చూపించాలి. ఒక దగ్గర ఫెయిల్ అయిన వ్యక్తి మరో చోట విజయం సాధిస్తాడు. ఆ సమయం కోసం వేచి చూడాలి. ఇటువంటి విషయాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థం అయ్యే రీతిలో చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS